
-నిన్న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయిన ప్యారడైజ్
-థియేటర్స్ దగ్గర నాని జాతర
-మరి ఫస్ట్ డే ఎంత రాబట్టిందో చూద్దాం.
నాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్' తో వరల్డ్ వైడ్ సెల్యులాయిడ్ పై ల్యాండ్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,732 షోలు ప్రదర్శించగా నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను సాధించి తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది.
'ది ప్యారడైజ్' మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 76 .90 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. మొత్తం 76 .90 కోట్ల గ్రాస్ లో ఇండియా గ్రాస్ 54.90 కోట్లు కాగా, ఓవర్సీస్ 22 కోట్ల గ్రాస్ . రిలీజ్ డేట్ కంటే ముందు రోజు, అంటే ప్రీమియర్స్ ద్వారానే 11.60 కోట్లు రాబట్టి సంచలనమే సాధించిందని చెప్పవచ్చు. మొదటి రోజు కలెక్షన్లలో ఏకంగా 198.7 శాతానికి పైగా భారీ ఎదుగుదల నమోదవడం విశేషం.

భాషల వారీగా చూస్తే, తెలుగు వెర్షన్ ఈ కలెక్షన్ల ప్రభంజనానికి ప్రధాన శక్తిగా నిలిచింది. తెలుగు వెర్షన్ ఒక్కటే 6,203 షోలలో ప్రదర్శితమై 31.30 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది, అలాగే 62.9% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. హిందీ వెర్షన్ 2,632 షోలతో 2.25 కోట్లు నెట్ కలెక్ట్ చేయగా, తమిళ వెర్షన్ 897 షోలతో 1.10 కోట్లు రాబట్టింది. ప్రెజెంట్ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో వీకెండ్ తో పాటు రాబోయే రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. నిన్న 12 pm టైంకే 60 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అయితే అధికార ప్రకటన చేసారు.
[The Paradise, The Paradise First Day collections, Nani, Kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






