
హీరోయిన్స్ కి గౌరవం తెచ్చిన నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. హీరోయిన్ కట్ అవుట్ చూసి కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారని నిరూపించిన ఈ నాచురల్ సుందరాంగి రాబోయే కొన్ని నెలల వ్యవధిలోనే వరుసగా పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినీ ప్రియులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రణబీర్ కపూర్, నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ'లో సీతాదేవిగా నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు తమిళంలో ధనుష్‌తో చేసిన భారీ యాక్షన్ డ్రామా 'ఓం' (OM Chapter-1 Udhiram: The Blood Wood) సరికొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. నవంబర్ 20, 2026న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. అంటే కేవలం 2 వారాల (14 రోజుల) వ్యవధిలోనే సాయిపల్లవి నటించిన రెండు అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాలు 'రామాయణ', 'ఓం' బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఇలాంటి అరుదైన అవకాశం ఏ హీరోయిన్ కి త్వరగా లభించదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 100 శాతానికి పైగా డెడికేషన్‌తో ప్రాజెక్టులను ఎంచుకునే సాయిపల్లవి, తన కరియర్‌లో ఈ 2026-2027 కాలంలో వరుసగా 4 ప్రధాన చిత్రాలతో దాదాపు 1500 కోట్ల వ్యాపార మార్కెట్‌పై ప్రభావం చూపబోతోంది.
ఇది కూడా చదవండి: 'చుట్టమల్లే’ఏఐ మార్ఫింగ్ వీడియో చేసింది వీళ్ళే!

.webp)
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం తన అభినయం, డాన్స్ నైపుణ్యాలతోనే కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ, బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో అని సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
[Sai Pallavi Back To Back Movies Release, Sai Pallavi upcoming movies, Ramayana movie release date, Sai Pallavi Dhanush Om,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)






