Home

»

Latest News

చరణ్ సుకుమార్ RC17 షాకింగ్ డెడ్‌‌లైన్! 

Oct 3, 2026 5:53PM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ ల మూవీ దసరా రోజు స్టార్ట్ కాబోతుందనే న్యూస్ అయితే సినీ సర్కిల్స్ లో ఒక రేంజ్ లోనే చక్కరకొడుతుంది.సినీ క్లైమెట్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాల కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి వైరల్ హోదాలో జోష్ ని తీసుకొచ్చింది.


సాధారణంగా సుకుమార్ మూవీ అనగానే ఎంతో నిడివి, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ గుర్తుకొస్తాయి. ఆయన గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే.. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన 'రంగస్థలం' షూటింగ్ దాదాపు ఏడాదికి పైగా సమయం తీసుకుంది. ఇక 'పుష్ప 1' ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందడంతో కోవిడ్ మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' షూటింగ్ అయితే 2022లో ప్రారంభమై, సుదీర్ఘంగా సాగి 2024 నవంబర్‌ వరకు దాదాపు 2 సంవత్సరాల పైనే సమయాన్ని తీసుకుంది.

స్క్రిప్ట్ విషయంలో, అలాగే ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దడంలో సుకుమార్ ఎంత సమయమైనా కేటాయిస్తారు. కానీ 'RC17' విషయంలో మాత్రం ఒక అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక కఠినమైన డెడ్‌‌లైన్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను రాబోయే డిసెంబర్  నాటికి పట్టాలెక్కించి, కేవలం 12 నెలల వ్యవధిలోనే.. అంటే సరిగ్గా 2027 డిసెంబర్ నాటికి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.


ఇది కూడా చదవండి: రెండు వారాల గ్యాప్‌లో: రెండు పాన్ ఇండియా సినిమాలు.. ప్లస్సా? నిర్మాతలకి రిస్కా!

 

 

ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కేవలం 12 నెలల పక్కా టైమ్‌ఫ్రేమ్‌లో పూర్తి చేయాలని భావించడం సుకుమార్ స్టైల్‌కి పూర్తి భిన్నమైనదని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రతి పాత్ర, విజువల్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఆయన, ఈ 12 నెలల డెడ్‌లైన్‌‌ను అందుకోగలరా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా మారింది.ఏది ఏమైనా సబ్జెక్ట్ గా పక్కాగా ఉండి మైండ్ లో  టార్గెట్ ఫిక్స్ అయితే పెద్ద కష్టమేమి కాదు. 

 

[Rc17 Update, Rc17 Shooting Deadline Target, Ram Charan, Sukumar, RC17 shooting deadline, RC17 movie update]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com