
ఎన్టీఆర్ యాక్టింగ్ కి, డాన్స్ లకి ఉన్న కెపాసిటీ తెలిసిందే. సాంగ్స్ కూడా దాదాపు అన్ని హిట్. ఆ కోవలోనే ప్రీవియస్ మూవీ 'దేవర తో పాటు అందులోని 'చుట్టమల్లే' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ప్రేక్షకులను అలరించిన ఈ చార్ట్బస్టర్ సాంగ్ ఆధారంగా కొందరు ఆకతాయిలు అత్యంత అసభ్యకరమైన రీతిలో ఏఐ మార్ఫింగ్ వీడియో సృష్టించారు. నెట్టింట తీవ్రంగా సర్క్యులేట్ అవుతున్న ఈ వికృత కంటెంట్పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిందితులకు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా స్పందించిన ఎన్టీఆర్, ఈ చర్యను అత్యంత రోత పుట్టించే, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. "స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే పవిత్రమైన భారతావని మనది. 'మాతృదేవోభవ' అనేది కేవలం మాట మాత్రమే కాదు, అది తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తున్న సంస్కృతిలో ఒక భాగం. అలాంటి సాంప్రదాయం ఉన్న గడ్డపై, సాంకేతికతను వాడుకొని ఒక మహిళ ఆత్మగౌరవాన్ని బజారుకీడ్చేలా ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. ఈ మార్ఫింగ్ వీడియోని తయారుచేసిన కీచకులని, దానిని రకరకాల ప్లాట్ఫారమ్లలో సర్క్యులేట్ చేస్తూ వైరల్ చేస్తున్న ప్రతి ఒక్కరినీ చట్టపరంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతీ ఒక్కరిపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ' తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే!

దీంతో ఇప్పుడు ఆ అసభ్యకరమైన ఏఐ వీడియోని ఎవరు రెడీ చేసారనే చర్చ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏది ఏమైనా అణువణువున పైత్యం ఎక్కువ నిండిన వాళ్లే చేసుంటారనేది మాత్రం నిజం.
[Ntr Warning Ai Morphed Chuttamalle Video,Jr NTR, Chuttamalle Morphed Video, AI Deepfake Controversy, Jr NTR Warning Legal Action,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)






