సీతమ్మ లుక్‌పై ట్రోలింగ్.. సాయి పల్లవిస్ట్రాంగ్ కౌంటర్.. నా ఆత్మవిశ్వాసాన్ని కదిలించలేరు!
Nov 28, 2026 4:40PM

సాయిపల్లవి.. హీరోయిన్ అనే వర్డ్ ని చెప్పుకునే ఈ మోడరన్ సినీ డేస్ లో నటీమణి అని చెప్పుకున్నా జెన్ జి బ్యాచ్ యాక్సెప్ట్ చేసే విధంగా నటనకి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చింది. ప్రెజెంట్ రామాయణ ద్వారా నయా సీతమ్మ వారుగా అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో కొలువుతీరింది.
అయితే రామాయణలో ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేశారు. సీతమ్మ వారి రోల్ కి సాయి పల్లవి సరిపోతుందా? ఆమె అందం క్యారక్టర్ కి తగినట్టుగా ఉందా? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. తాజాగా ఈ విమర్శలపై సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీతమ్మ అందం గురించి కామెంట్స్.. సాయి పల్లవి ఏమన్నారంటే?
ముంబైలో జరిగిన 'వీ ది ఉమెన్' కార్యక్రమంలో జర్నలిస్ట్ బర్ఖా దత్తో జరిగిన సంభాషణలో సాయి పల్లవి తన అనుభవాలను పంచుకున్నారు. రామాయణలో సీత పాత్ర పోషించిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి ఆమెను ప్రశ్నించగా.. తనకు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి తెలియదని అనుకోవద్దని చెప్పారు.

సీతమ్మ ఎంత అందంగా ఉండాలి? ఆమె లుక్ ఇలా ఉండాలి అంటూ వచ్చే కామెంట్లు తన దృష్టికి వస్తూనే ఉంటాయని తెలిపారు. అయితే అలాంటి అభిప్రాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే స్థాయికి చేరకూడదని అన్నారు. మనలో మనకు బలమైన నమ్మకం ఉండాలని, అప్పుడే బయటి ప్రపంచం నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోగలమని చెప్పారు. తనకు సాధ్యమైనంత వరకు తాను ఆత్మవిశ్వాసంతో ఉంటానని, ఎవరి అభిప్రాయాలు వారివని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: చిన్నప్పుడు మాట తడబడేది: ఇప్పుడు ప్రపంచాన్నే నవ్విస్తున్నాడు.. మిస్టర్ బీన్ అసలు కథ ఇదే!
గ్లామర్ పాత్రలంటే ఆసక్తి లేదు!
సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు? అనే ప్రశ్నకు కూడా సాయి పల్లవి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. కేవలం గ్లామర్ కోసం ఉపయోగించే పాత్రలు తనకు నచ్చవని తెలిపారు. ఒక హీరోయిన్ను కేవలం అందంగా చూపించడానికి లేదా మరొకరితో భర్తీ చేయగలిగే పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదన్నారు.
తాను ఎప్పుడూ బలమైన పాత్రల కోసమే ఎదురుచూస్తానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో మంచి పాత్రల కోసం ఎదురుచూడటం చాలా కష్టంగా ఉండేదని, దాదాపు నాలుగైదేళ్ల పాటు తనకు నచ్చిన పాత్రల కోసం ఓపికగా వేచి ఉన్నానని వెల్లడించారు. మంచి పాత్రలు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో కూడా తనకు నచ్చని సినిమాలు చేయకుండా ఉండటం అంత సులభం కాదని వివరించారు.
మేనేజర్ కూడా లేకుండా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి!
ఇప్పటి స్టార్ హీరోయిన్లు చాలామంది మేనేజర్లు, ప్రత్యేక బృందాలతో పనిచేస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం మేనేజర్ లేదా ప్రత్యేక ఎంటూరేజ్ లేకుండానే తన పనులు తానే చూసుకుంటానని తెలిపారు. దర్శకులు, నటీనటులు తనను సులభంగా సంప్రదించగలిగేలా ఉండటం తనకు ఇష్టమని చెప్పారు. సినిమాల విషయంలో మధ్యవర్తులు లేకుండా నేరుగా కథలు వినడం, అందరితో సులభంగా మాట్లాడటం తనకు నచ్చుతుందని వెల్లడించారు.

మహిళల అందంపై సమాజం అభిప్రాయం మారాలి!
సినిమాల్లో హీరోలకు వయసు, శరీరాకృతి విషయంలో ఎన్నో రకాల పాత్రలు దక్కుతుంటాయని.. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఎప్పుడూ అందంగా, పర్ఫెక్ట్గా కనిపించాలనే అంచనాలు ఉంటాయని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. మహిళలను కూడా సహజమైన రూపాల్లో తెరపై చూపించాల్సిన అవసరం ఉందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
మొత్తానికి సీత పాత్రపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా తన ఆత్మవిశ్వాసమే ముఖ్యమని సాయి పల్లవి చెప్పడం ఆసక్తికరంగా మారింది. అందం కంటే పాత్రలోని బలం, నటనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆమె ఆలోచన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే వెండితెర నటినిగాని నటీమణిని గాని దత్తత(ఓన్) తీసుకునేదే నిజమైన అందం.
మీకు నచ్చవచ్చు
అయోధ్యలో యాక్షన్ కింగ్ అర్జున్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డు!
నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నయా అప్ డేట్ ఇదే!
[Sai Pallavi, Ramayana, Seethamma Trolls, Bollywood ]




