TeluguOne App Promotion
● # Tweets

Home

»

గాసిప్‌లు

మోక్షజ్ఞ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్: ఫ్యాన్స్ సంబరాలు! 

Nov 28, 2026 2:05PM

మేబీ ఇప్పుడు చెప్పుకుంటున్న పూర్తి మ్యాటర్ కంప్లీట్ అవ్వకుండానే నందమూరి అభిమానులంతా ఆపకుండా డాన్స్ లు చేస్తారేమో. ఎందుకంటే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని? ప్రేక్షకులలో కూడా ఆనందాన్ని నింపే ఈ న్యూస్ కి సంబంధించి పూర్తి మ్యాటర్ చూద్దాం.

నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా మోక్షజ్ఞ సెల్యులాయిడ్ పై   అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడనే న్యూస్  ఎక్స్ క్లూజివ్ హోదాలో సినీ అడ్డాస్, సోషల్ మీడియాలో రూమర్ హోదాలో చక్కర్లు కొడుతూ ఉంది .

  ఆ అందరి మాటల ప్రకారం ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకమైన రోల్  ఉందట. ఎన్టీఆర్ చేస్తే  బాగుంటుందని దర్శకుడు వశిష్ఠ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని బాలకృష్ణ దగ్గర కూడా ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మాత్రం నందమూరి అభిమానులకు పెద్ద పండగే అని చెప్పాలి.  అదే విధంగా మూవీ రూపు రేఖలు మారిపోయి అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు చాలా ఏళ్ళ తర్వాత  ఒకే సినిమాలో కనిపించడం అభిమానులకి, ప్రేక్షకులకి ప్రత్యేకమైన అనుభూతిని కూడా ఇస్తుంది.

ఇది కూడా చదవండి: బాహుబలి 2 రికార్డ్స్ కి సారీ చెప్పిన రామాయణ: అది కూడా 23 డేస్ లోనే!

 సోషియో ఫాంటసీ జోనర్ అనే రూమర్ కూడా యథేచ్ఛగా స్ప్రెడ్ అవుతుండటం అదనపు స్పెషాలిటీ.  మోక్షజ్ఞ తొలి సినిమా కావడంతో బాలకృష్ణ కూడా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథ, పాత్రలు, మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

నిజానికి గత కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం ఉందంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కుటుంబానికి సంబంధించిన సందర్భాల్లో నందమూరి కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా నిలిచిన దాఖలాలు ఉన్నాయి.

 

ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ సినిమాలో ఎన్టీఆర్ ప్రత్యేక రోల్ లో కనిపిస్తారనే    వార్త రావడం ఆసక్తిని పెంచుతోంది. నిజంగానే ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటే నందమూరి అభిమానులకి భావోద్వేగపరంగా కూడా ప్రత్యేకమైన సందర్భం అవుతుంది.

ఏది ఏమైనా రూమర్ కి కూడా అందరి లాగానే ఒక మనసు ఉంటుందని, ఎన్టీఆర్, మోక్షజ్ణ న్యూస్    నిజమవ్వాలని కోరుకుందాం. ఎన్టీఆర్ ప్రెజెంట్ డ్రాగన్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

మీకు నచ్చవచ్చు 

ప్రముఖ హీరోయిన్ భక్తి  పాటలు: మంత్ర ముగ్దులు అవుతున్న ఫ్యాన్స్! 

కావాల్సింది గెటప్, బ్యాక్ గ్రౌండ్ కాదు.. కథ, కథనం సామి!

 

[Balakrishna,Ntr, Mokshjna, Vasishta, Tollywood]

 

google-ad-img