యాక్షన్ కింగ్ అర్జున్ నయా సంచలనం:అయోధ్యలో ఆపరేషన్ సిందూర్.. ఇండియాలోనే తొలి మూవీ!
Nov 28, 2026 3:18PM

యాక్షన్ కింగ్ అర్జున్.. ఈ పేరు వెనక భద్రంగా దాగి ఉన్న సినీ హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే డేస్ చాలవు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన అర్జున్ తెలుగులో పరిచయమైన రెండవ సినిమాతోనే 365 రోజుల షీల్డ్ అందుకున్నాడు. వంద రోజుల సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అర్జున్ ని కన్నడ ఇండస్ట్రీ అనడానికి నీకు మనసెలా వచ్చిందనే తెలుగు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అదండీ సింపుల్ గా ఆ పేరు వెనక దాగి ఉన్న హిస్టరీ.
గతంలో 'జై హింద్', 'వందేమాతరం' వంటి సినిమాలతో దేశభక్తి చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన అర్జున్ ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. విశేషం ఏంటంటే.. అర్జున్ కెరీర్లో ఇది 175వ సినిమా కావడం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు.
అయోధ్య రామజన్మభూమిలో సినిమా ప్రారంభం!
నిన్న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తన భార్య నివేదితతో కలిసి అర్జున్ ఈ వేడుకలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రత్యేక అతిథులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంలో ప్రారంభ పూజ నిర్వహించుకున్న తొలి భారతీయ చిత్రంగా తమ సినిమా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

పహల్గామ్ దాడి.. ఆపరేషన్ సిందూర్ ప్రధాన నేపథ్యం!
2025లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కూడా దేశ చరిత్రలో కీలక పరిణామంగా నిలిచింది. ఈ రెండు ఘటనల స్ఫూర్తితోనే అర్జున్ సర్జా తెరకెక్కిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: మాస్ ఇమేజ్ వెంట పరుగులు వద్దు.. మన హీరోలకి ధనుష్, దుల్కర్ చూపిస్తున్న నిఖార్సయిన దారి!
రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవ్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సైనిక జీవితంపై ఆయనకు ఉన్న అనుభవం ఈ కథకు వాస్తవికతను తీసుకొస్తుందని చిత్రబృందం భావిస్తోంది. సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలు, దేశ భద్రత, క్లిష్ట పరిస్థితుల్లో వారి పోరాటం వంటి అంశాలను భావోద్వేగాలతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
హీరోగా, దర్శకుడిగా అర్జున్!
అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా చేస్తున్నాడు.ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మిస్తుండగా టైటిల్ ఇంకా ప్రకటించలేదు. #ActionKing175 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్ గురించి ప్రచారం చేస్తున్నారు.

తొమ్మిది భాషల్లో పాన్ ఇండియా రిలీజ్!
ఈ చిత్రాన్ని ప్రధానంగా హిందీలో రూపొందించి, మొత్తం తొమ్మిది భారతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మొత్తానికి తన 175వ సినిమాకు అర్జున్ సర్జా ఎంచుకున్న కథాంశం ఆసక్తిని పెంచుతోంది. దేశ చరిత్రలో చోటుచేసుకున్న కీలక ఘటనలను వెండితెరపై ఎలా చూపిస్తారు? సైనికుల త్యాగాలు, వారి భావోద్వేగాలను ఎంత వాస్తవికంగా ఆవిష్కరిస్తారు? అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు
నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్: మోక్షజ్ఞ మూవీలో తారక్!
సుప్రీం కోర్ట్ ఆర్డర్ ప్రకారం మరో రామాయణ మూవీ తీస్తారా? అంతా టెన్షన్ మయం!
[Arjun Sarja, 175th Film , Ayodhya, Pahalgam Attack, Operation Sindoor]




