Home

»

Latest News

VIjay deverakonda: యాక్షన్ స్టైల్‌ని విజయ్ దేవరకొండ మొదలు పెట్టాడా!

Apr 22, 2026

 

 

గోల్డెన్ స్పూన్ తో పుట్టాడురా అనుకునే మాట రేంజ్ లోనే  విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ని చూస్తే సినీ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని అనుకోవచ్చు. మరి ప్లాప్స్ లిస్ట్  చాలా వయ్యారంగా వంపులు తిరిగి కనపడుతున్నా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తు అభిమానులకి  మై హునా అనే భరోసా కల్పిస్తున్నాడు. ప్రెజెంట్ తన శ్రీమతి రష్మిక(Rashmika)తో చేస్తున్న రణబాలి, రౌడీ జనార్ధన(Rowdy janardhana)శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాయి. సినీ సర్కిల్స్ లో రౌడీ జనార్ధన గురించి ఒక నయా అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. అదేంటో చూద్దాం.

Also read: Peddi: పెద్ది స్పెషల్ సాంగ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్!.. నిజమవ్వాలని ఫ్యాన్స్ ఆశ

రౌడీ జనార్ధనలో ఒక ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందంట. సదరు ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. సదరు యాక్షన్ సీన్స్ మూవీ మొత్తానికే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని సోషల్ మీడియాలో నయా అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ చూసిన ఫ్యాన్స్ రౌడీ జనార్దన ఊహల్లోకి వెళ్లిపోయారు.  స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధనలో విజయ్‌కి జోడీగా కీర్తి సురేశ్‌ చేస్తుండగా సీనియర్‌ హీరో రాజశేఖర్‌(Rajasekhar)ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుండగా రవి కిరణ్ కోలా(Ravikiran Kola) దర్శకుడు. విజయ్ రీసెంట్ గా హాయ్ నాన్న దర్శకుడు శౌర్యవ్ తో మరో కొత్త మూవీ అనౌన్స్ చేసాడు  

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com