Home

»

Latest News

బాంబు పేల్చిన రెజీనా: బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?

Nov 5, 2026 12:35PM

సినిమా ఇండస్ట్రీలో నార్త్, సౌత్ అనే విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా? తాజాగా నటి రెజీనా కాసాండ్రా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తనను కావాలనే ప్రమోషన్లకు దూరంగా పెట్టిందని ఆమె ఆరోపించారు. 'కేసరి ఛాప్టర్ 2' సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల జాన్వీ కపూర్, రాధికా ఆప్టే తెలుగు సినిమాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నార్త్-సౌత్ విభజన గురించి కూడా రెజీనా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

'పెద్ది' సినిమాలో తన పాత్ర చిత్రీకరణపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. సినిమాలో బౌండ్ స్క్రిప్ట్ ఉండదని, కెమెరా యాంగిల్స్ కూడా ముందుగా తెలియవని సౌత్ ఇండస్ట్రీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.

అటు నటి రాధికా ఆప్టే సైతం గతంలో తెలుగు సినిమాలో నటించినప్పుడు ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. వయసులో పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, తన పాత్ర మధ్యలోనే చనిపోతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. అప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పుడు ఆకాశానికెత్తి, ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ తెలుగు ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో రెజీనా కాసాండ్రా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. నార్త్ ఇండియన్ హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు నార్త్-సౌత్ విభజనను సృష్టించేలా వ్యాఖ్యలు చేయడంపై తనకు అభ్యంతరం ఉందని ఆమె అన్నారు.

అంతేకాదు.. కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలో తాను నటించినప్పుడు కూడా సౌత్ నటిగా వివక్ష ఎదుర్కొన్నానని ఆరోపించారు. 'కేసరి ఛాప్టర్ 2' సినిమాలో అక్షయ్ కుమార్ భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ ప్రమోషన్ల సమయంలో తన పేరును తొలగించారని వెల్లడించారు.

తనకు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ప్రమోషన్ల నుంచి పక్కన పెట్టారని, తనపై పాటను విడుదల చేసినప్పటికీ కనీసం సోషల్ మీడియాలో ట్యాగ్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా తాను సౌత్ ఇండియన్ నటిని కావడం వల్లే జరిగిందా? అంటూ ప్రశ్నించారు.

నిజానికి రెజీనా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆ తర్వాత హిందీ సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. 'జాత్', 'కేసరి ఛాప్టర్ 2' వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు మాత్రం అంత సానుకూలంగా లేవని గతంలోనూ ఆమె చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ట్విన్ సిస్టర్స్‌తో రొమాన్స్.. ఒకరిని ప్రేమించి మరొకరితో.?

 

 

 

[North South Divide, Regina Cassandra, Karan Johar, Dharma Productions, Kesari Chapter 2, Janhvi Kapoor, Radhika Apte, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com