Home

»

Latest News

Razor: రేజర్ తొలిరోజు కలెక్షన్స్ ఇవేనా!.. ఇక రికార్డులే తరువాయి

May 09, 2026

 


విభిన్న చిత్రాల హీరోగా, దర్శకుడిగా రవిబాబు(Ravibabu)ప్రేక్షకుల మైండ్ సెట్ నుంచి అంత త్వరగా వెళ్ళిపోడు. ప్రేక్షకులు సినిమాకి ఇచ్చే గౌరవం అది. ఈ విషయం తెలిసే రవిబాబు కొంచం గ్యాప్ తీసుకొని నిన్న రేజర్(Razor)తో సెల్యులాయిడ్ పై టేక్ ఆఫ్ అయ్యాడు. మరి తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూడాలి.


తొలి రోజు 50 లక్షలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మూవీకి ప్రెజెంట్ పాజిటివ్ టాక్ రన్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మౌత్ టాక్ తో  రేజర్ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. పైగా రేజర్ తో పాటే రిలీజైన గోదారిగట్టుపైన ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రేజర్ కి థియేటర్స్ అదనంగా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్ తో  కలిపి సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అత్యున్న నిర్మాణ విలువలు, సినిమాటిక్ అనుభూతి కోసమే ఆ రేంజ్ లో ఖర్చు చేశారు. మరి ఈ లెక్కన రేజర్ లాభాల్లోకి రావాలంటే 9 కోట్ల రూపాయల షేర్, 17 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుందని  ట్రేడ్ వర్గాల టాక్.

Also read: Kalki part 2: కల్కి పార్ట్ 2 రిలీజ్ టైం ఇదేనా!. ఇదే నిజమైతే అందరికి పండగే 

 ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై రవిబాబునే స్వయంగా నిర్మించగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రణవి మానుకొండ, ప్రదీప్ ఆంటోనీ, దావూది జివాల్, తనీష్, ఇనయా సుల్తానా కీ రోల్స్   పోషించారు. రవిబాబు ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం తన ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లతోనే  రవిబాబు రేజర్ పై హైప్ తీసుకొచ్చాడు 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com