Home

»

Latest News

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!

May 9, 2026 3:32PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో సీనియర్ నిర్మాత తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ (85) శనివారం (మే 9, 2026) హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు. 

కాకర్ల కృష్ణ ప్రముఖ నిర్మాణ సంస్థ 'జగపతిస ఆర్ట్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1974లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'ఇంటింటి కథ' చిత్రంతో ఆయన పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. సామాన్య స్థాయి నుండి స్వయంకృషితో నిర్మాతగా ఎదిగి, పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. కాకర్ల కృష్ణ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ పెద్దలు పేర్కొన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com