
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తో డైరెక్టర్ గా టాలీవుడ్‌కు పరిచయమైన బుచ్చిబాబు సానా.. రెండో సినిమా 'పెద్ది'ని ఏకంగా రామ్ చరణ్ తో చేసి సంచలనం సృష్టించారు. అయితే బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు రాసిన మొదటి కథ మాస్ మహారాజా రవితేజ కోసం రాశారు. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబు స్వయంగా రివీల్ చేయడం విశేషం.
రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బుచ్చిబాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరి ముందు చెప్పారు. "నా మొదటి కథను రవితేజ గారి కోసమే రాసుకున్నాను. ఆ కథ ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉంది. ఎప్పటికైనా ఆ కథను రవితేజ గారికి నేరేట్ చేస్తాను." అని చెప్పారు.
బుచ్చిబాబు మాటలను బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన రవితేజతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అనిపిస్తోంది.
ప్రస్తుతం బుచ్చిబాబు 'పెద్ది' సినిమాతో సూపర్ సక్సెస్ మీదున్నారు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అది పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటోంది. మరోవైపు రవితేజ కూడా 'ఇరుముడి'తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశముంది.
Irumudi Movie, Ravi Teja, Buchi Babu Sana, Peddi Movie






