
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా తమిళ సరుకు 'డిసి' గురించే చర్చ నడుస్తుంది. మన దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిన బడా హీరోల సినిమాలనే తమిళ తంబీ పెద్దగా పట్టించుకోడు. కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం డి సి బాగుందని టాక్ రావడం ఆలస్యం చలో టూ 'డిసి' థియేటర్స్ అంటున్నారు. వీకెండ్ తో సంబంధం లేకుండా మంగళ, బుధవారాల్లో నైట్ సెకండ్ షో హౌస్ ఫుల్ అవుతుంటే థియేటర్ యజమానులు కూడా కల, నిజామా అంటూ గిల్లుకొనే పరిస్థితి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా 'డిసి' గురించి మాట్లాడుకుంటున్నారు
తెలుగు సినిమా ప్రియులు ఎప్పుడూ డార్క్ కథలు, ఎమోషనల్ షేడ్స్, డెప్త్ ఉన్న ఆంటి-హీరో లేదా మాస్ క్యారెక్టర్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతారు. డీసీ కామిక్స్ లోని "బ్యాట్‌మ్యాన్", "జోకర్" పాత్రలలో ఉండే తీవ్రమైన అంతర్మథనం, సైకలాజికల్ డ్రామా మన ఆడియన్స్‌కి ఎంతగానో నచ్చుతాయి. సరిగ్గా అదే తరహాలో, లోకేష్ కనగరాజ్ నటించిన "DC" మూవీలో దేవదాస్, చంద్ర అనే ఇద్దరు సమాజం చేత తీవ్రంగా గాయపడిన వ్యక్తుల వైలెంట్ రివెంజ్ డ్రామా తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌కి సరిగ్గా సెట్ అయింది. లొకేషన్ల డార్క్ మూడ్, అపరిమితమైన యాక్షన్ కంటెంట్, మరియు అనిరుధ్ రవిచందర్ అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తెలుగులో మాస్ రికార్డుల దిశగా నడిపించాయి.
Also read: ఇరుముడి vs టాక్సిక్.. వాళ్ళు ఎటు వైపు!
లోకేష్ కనగరాజ్ స్వయంగా దర్శకుడిగా "LCU"తో సృష్టించిన డార్క్ సినిమాటిక్ వాతావరణం, ఆయన నటనలో కూడా కనిపించడం వల్ల కూడా మరింత బ్రహ్మరథం పట్టారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వరల్డ్ వైడ్ గా 84.31 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, తమిళనాడు కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది. దీన్ని బట్టి తెలుగు ప్రేక్షకులు డిసి ని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు..DC అంటే దేవదాస్, చంద్ర.
Lokesh Kanagaraj, wamiqa Gabbi, Arun Matheswaran





