
పాజిటివ్ వైబ్రేషన్స్ తో వస్తున్న ఇరుముడి హిట్ అయ్యి రవితేజని ప్లాప్స్ భూతం నుంచి
బయట పడేస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ తో పాటు అజయ్ ఘోష్ భూతులు మాట్లాడారనే విమర్శలు వస్తున్నా సినిమా బాగుంటే అవన్నీ జుజుబీ.. కానీ సినీ ట్రేడ్ సర్కిల్స్ లో ఇప్పట్నుంచే టాక్సిక్ వర్సెస్ ఇరుముడి నినాదం తన ప్రతాపాన్ని చూపిస్తుంది.
'ఇరుముడి' ఈ నెల 21న అంటే ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఐదు రోజుల వ్యవధిలోనే, అంటే 26న యశ్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' థియేటర్లలోకి వస్తోంది. దీనివల్ల 'ఇరుముడి'కి ఫుల్ లెంగ్త్ 2 వారాల సోలో లాంగ్ రన్ లభించని పరిస్థితి ఏర్పడింది. కెజియఫ్ సిరీస్ తర్వాత యశ్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరగడం, 'టాక్సిక్' సినిమాపై ఉన్న మైండ్ బ్లాకింగ్ అంచనాల వల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లు, ప్రైమ్ షోలు ఆ సినిమాకే కేటాయించాల్సి వస్తుంది. మొదటి 3 రోజుల్లోనే 'ఇరుముడి' అత్యంత వేగంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, భారీగా కలెక్షన్లు రాబడితేనే థియేటర్లను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. 'ఇరుముడి'లోని భక్తి, ఎమోషన్, డ్రామా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కలెక్షన్లు స్థిరంగా ఉంటాయి. కానీ బాక్సాఫీస్ టైమింగ్ లెక్కల్లో 5 రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో, రవితేజ తన మార్కెట్ హోల్డ్‌ను మొదటి వీకెండ్‌లోనే 100% నిరూపించుకోవాల్సి ఉంది. మరి 'టాక్సిక్' సునామీని తట్టుకుని మాస్ మహారాజా 'ఇరుముడి' విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Also read: ఆ రాజకీయ పార్టీలో చేరిన శ్రష్టి వర్మ.. అసలు ఆట ఇప్పుడు మొదలు కానుందా!
ఏది ఏమైనా ఈ రసవత్తు పోరు అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుండగా సినీ అభిమానులు, ప్రేక్షకులు మంత్ ఎండింగ్ సమీపిస్తుండటంతో రెండు సినిమాలని ఫ్యామిలీ తో సహా చూడటానికి కావాల్సిన సరిపడా అమౌంట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. పైగా పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మాన్ షో 'ఖలీఫా' 20 వ తారీకు విడుదల కావడం బోనస్.
Irumudi, Toxic, Raviteja, Yash






