Home

»

Latest News

ఒక్క సినిమా లాభాలతో హైదరాబాద్ నడిబొడ్డున బిల్డింగ్ కొన్న రామోజీరావు.. ఆ కల్ట్ మూవీ ఏదో తెలుసా!

Nov 17, 2026 10:47AM


రామోజీరావు.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్, ఒక వ్యవస్థ అని పాలు తాగే పిల్లోడిని అడిగినా చెప్పేస్తారు. ఆ సంస్థలో పని చేసి వచ్చిన, చేస్తున్న వాళ్ళకి అయితే దేవుడు..దశాబ్డల క్రితమే  సీరియల్స్ అనే వాటిని రామోజీ రావు గారు ఓన్ చేసుకొని కార్పొరేట్ కల్చర్ తీసుకురాకపోయి ఉంటే కళని నమ్ముకొని హైదరాబాద్ వచ్చిన ఎంతో మంది మంది కళాకారులు హైదరాబాద్ వదిలి వెళ్లిపోయేవాళ్ళని నిత్యం సినీ సర్కిల్స్ లో వినిపించే మాట. అలాంటి రామోజీరావు గారు తన సినీ ప్రస్థానంలో లభించిన అపురూప విజయం తాలూకు న్యూస్ ఒకదాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.  


తెలుగు సినిమా  చరిత్రలో ఉషాకిరణ్ మూవీస్ సంస్థది ఒక ప్రత్యేక అధ్యాయం. 1983లో రామోజీరావు గారు స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ, కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని ఆలోచింపజేసే ఎన్నో కంటెంట్ ఆధారిత చిత్రాలని  అందించింది. 1984లో 'శ్రీవారికి ప్రేమలేఖ'తో మొదలైన ఈ ప్రస్థానంలో దాదాపు 80కి పైగా సినిమాలు తెరకెక్కాయి. అయితే, ఉషాకిరణ్ మూవీస్ చరిత్రలో ఒకే ఒక్క సినిమా సృష్టించిన సంచలనం, కురిపించిన కాసుల వర్షం ఆ సంస్థకి హైదరాబాద్ నడిబొడ్డున ఒక శాశ్వత చిరునామాని తెచ్చిపెట్టింది.

1989లో రామోజీరావు నిర్మాణంలో, ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విడుదలైన 'మౌన పోరాటం' అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. ఒడిశాకు చెందిన సబిత అనే ఒక గిరిజన మహిళ నిజ జీవిత పోరాటం ఆధారంగా ఈ సినిమాని  రూపొందించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ యథార్థ గాథని  తెరకెక్కించడానికి రామోజీరావు ఎంతో ధైర్యం చేశారు. ఎలాంటి కమర్షియల్ హంగులు, స్టార్ హీరోలు లేకుండా కేవలం బలమైన కథనే నమ్ముకుని సెట్స్ పైకి తీసుకెళ్లారు.

మౌన పోరాటం ద్వారానే నటి యమున, హీరో వినోద్ కుమార్ తెలుగు తెరకి  పరిచయమయ్యారు. అంతేకాదు, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి సంగీత దర్శకురాలిగా పనిచేసిన ఏకైక చిత్రం కూడా ఇదే కావడం విశేషం. దుర్గ అనే ఆదివాసి యువతి తన బిడ్డకి  తండ్రి పేరును, న్యాయాన్ని సాధించడం కోసం చేసిన అలుపెరగని పోరాటం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. జనం బ్రహ్మరథం పట్టారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టి నిర్మాత రామోజీరావుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.  

ఇది కూడా చదవండి:సినిమా హిట్ అవ్వాలంటే ఆ కలల రాకుమారి కంపల్సరీ అంట: తాజాగా వెలుగులోకి వచ్చిన నిజం!

ఆ కాలంలో 'మౌన పోరాటం' సినిమా సాధించిన అద్భుతమైన లాభాలతోనే రామోజీరావు హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన బేగంపేట మెయిన్ రోడ్డు (గ్రీన్ ల్యాండ్స్ సమీపంలో) ఉన్న ఉషాకిరణ్ మూవీస్ కార్యాలయ భవనాన్ని కొనుగోలు చేశారని సినీ ప్రముఖులు, విశ్లేషకులు చెబుతుంటారు. ఇండస్ట్రీలో "ఒక్క సినిమాతో ఆఫీస్ బిల్డింగ్ కొన్న నిర్మాత" అనే మాట వినిపించినప్పుడల్లా రామోజీరావు దూరదృష్టి, 'మౌన పోరాటం' సాధించిన ఘనవిజయం గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటారు.కేవలం ఆర్థికంగానే కాకుండా ప్రతిష్టాత్మక పురస్కారాల పరంగానూ 'మౌన పోరాటం' ఉషాకిరణ్ మూవీస్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది.

1989వ సంవత్సరానికి గాను ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో మరో నంది అవార్డుని  కైవసం చేసుకుంది. సామాజిక స్పృహతో తీసిన ఒక మంచి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, దశాబ్దాల పాటు ఒక దిగ్గజ నిర్మాణ సంస్థకు ప్రధాన కార్యాలయంగా నిలిచే ఆస్తిని సమకూర్చడం తెలుగు సినీ చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. రామోజీ గారి సినీ ప్రస్థానం చూసుకుంటే ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ సమాజానికి ఉపయోగపడే విలువలతో పాటు చైతన్యవంతుల్ని చేసే సినిమాలు.కమర్షియల్ జోనర్ అనే వర్డ్ ని తన కాంపౌండ్ గేట్ దగ్గరకి కూడా రానివ్వలేదు.

 

మీకు నచ్చవచ్చు:సాయి పల్లవి తల్లి వ్యాఖ్యలు వైరల్!
మీకు నచ్చవచ్చు:సోనియా గాంధీ బయోపిక్ రెడీ: ఈ హీరోయినేనా!

 

[Ramoji Rao, Mounaporatam, Ushakiran Movies, Yamuna, vinod Kumar]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com