Home

»

Latest News

సాయిపల్లవి తల్లి పెద్ద దుమారమే రేపింది: మరి అభిమానించి అందలం ఎక్కిస్తే ఇలాగే చేస్తారు!

Nov 16, 2026 4:52PM


సాయి పల్లవి ప్రస్తుతం వరల్డ్ సెల్యులాయిడ్ పై రామాయణతో సత్తా చాటుతూ ఉన్న విషయం తెలిసిందే. ప్రీవియస్ సీతా దేవి క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళకి, తనకి మధ్య వేరియేషన్స్  అత్యుత్తమ స్థాయిలోనే చూపించిందనే కితాబుని కూడా అందుకుంది. ఈ నెల 20 న ధనుష్ తో కలిసి కొత్త మూవీ 'ఓమ్' మూవీతో సందడి చేయనుంది.  

అమరన్ ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓమ్' లో సాయి పల్లవి మునుపెన్నడూ చూడని విధంగా నిత్యా రెడ్డి'  అనే ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ లో  కనిపించనుంది. రియల్ లైఫ్ డాషింగ్ ఐపీఎస్ ఆఫీసర్ 'మెరిన్ జోసెఫ్' గెటప్ స్ఫూర్తితో  అత్యంత సహజంగా మలిచారు.

సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో నటీమణులు పాత్రల కోసం విగ్గులు వాడటం సర్వసాధారణం, కానీ సాయి పల్లవి మాత్రం నిత్యారెడ్డి  కోసం విగ్ వాడకుండా ఏకంగా తన ఒత్తైన పొడవాటి జుట్టును నిజంగానే కత్తిరించుకోవడానికి సిద్ధపడ్డారు. ఇళ్లల్లో ఆడపిల్లల జుట్టు విషయంలో తల్లులు ఎంత సెంటిమెంట్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయి పల్లవి తల్లి కూడా దీనికి మినహాయింపు కాదు. 

 షూటింగ్ కోసం తాను జుట్టు కత్తిరించుకున్నాననే విషయాన్ని సాయి పల్లవి స్వయంగా ఫోన్ చేసి వాళ్ల అమ్మకు వీడియో కాల్ ద్వారా చెప్పగా, ఆ దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కూతురు తన అందమైన జుట్టును అలా కత్తిరించుకుందన్న కోపంతో, బాధతో ఆవిడ వెంటనే ఫోన్ కట్ చేశారట. ఆ తర్వాత ఆమె తండ్రి ఫోన్ చేసి అది విగ్గా అని ఆరా తీయగా, సాయి పల్లవి అసలు నిజం చెప్పి, ఆ తర్వాత ఎంతో కష్టపడి తల్లికి సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని తెలిపారు. 

ఇది కూడా చదవండి: త్రిష పెంపుడు కుక్క బర్త్ డే సెలబ్రేషన్స్: గెస్ట్ గా ఎవరొచ్చారో తెలిస్తే షాక్ అవుతారు!
క్యారక్టర్ కి  వంద శాతం న్యాయం చేయడం కోసం ఇంట్లో వాళ్ల కోపాన్ని కూడా లెక్కచేయకుండా సాయి పల్లవి తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ ఇప్పుడు సినిమా వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. సినిమాపై ఆమెకున్న ప్యాషన్‌ను, అంకితభావాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

 

ఓమ్ లో  ధనుష్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, శ్రీలీల, మరియు బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా తదితరులు కీ రోల్స్.

 

మీకు నచ్చవచ్చు:సోనియా గాంధీగా ఈ హీరోయిన్: ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
మీకు నచ్చవచ్చు:అసిస్టెంట్ డైరెక్టర్ తో స్టార్ హీరోయిన్ పెళ్లి!

 

[Sai Pallavi , Om, Dhanush, Mammotty, Raj Kumar Peria Swamy]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com