
భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు యావత్తు ఇది మా సినిమా, మా రాముని రామాయణం అంటూ గర్వపడేలా తెరకెక్కిన మూవీ రామాయణ. ఆ మాట అక్షర సత్యమనడానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలే సజీవ సాక్ష్యం.
రామాయణ’రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ పార్ట్ 1 రిలీజ్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన తేదీల కంటే ఒక రోజు ముందుగానే ఓ దేశంలో రామాయణ అక్కడి ప్రేక్షకుల చేత జై శ్రీరామ్ అనిపించబోతుంది. ఆ దేశమే సింగపూర్. సింగపూర్ లో నవంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఖరారు చేశారు. దీంతో ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందుగా సింగపూర్‌లోనే ‘రామాయణ’ పార్ట్ 1 ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.ఇది వాళ్ళకి రాముడు ఇచ్చిన సినీ వరంగా భావించవచ్చు.

Also Read: రాకాలో ఆ '37' మిస్టరీ ఏంటి: విప్పిన వాళ్ళు నిజమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్!
రాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మ వారుగా సాయి పల్లవి,రావణుడిగా యష్ ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారో అని రామభక్తులు, ప్రేక్షకులు, మూవీ లవర్స్ కాచుకొని కూర్చున్నారు. దీంతో దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారి, అంతర్జాతీయ లెజండ్రీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా రాముడి కోసం ఎంత తపనపడ్డారో తెలిసిపోనుంది.
[Ramayana, Ramayana Part 1 To Release First In This Country, Singapore, Ranbir Kapoor , Saipalavi, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






