
జోనర్ ఏదైనా సరే ;బోల్డ్ సీన్స్' కి కూడా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారనేది సినీ సత్యం. పైగా రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. కానీ వాళ్ళని బాధకి గురి చేసే అంశం ఏంటంటే బోల్డ్ మరియు రొమాంటిక్ సీన్లు అనేవి చాలా వరకు సహజంగా క్రికరించినవి కావు. సినిమాలైనా వెబ్ సిరీస్‌లైనా అదే బాపతు.
వీటిపై చాలా వివరంగా ప్రముఖ హాలీవుడ్ నటి సారా షాహీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడి చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతమైన ప్రజాదరణ పొందిన 'సెక్స్/లైఫ్' (Sex/Life) వంటి సిరీస్‌లలో ధైర్యంగా నటించిన సారా, బెడ్‌రూమ్ సన్నివేశాల్లో హీరోలు లేదా సహ నటుల శరీర స్పర్శ లేకుండా సీన్లు ఎలా రికార్డ్ చేస్తారో వివరంగా వెల్లడించింది.
ఆమె మాట్లాడుతు హాలీవుడ్‌లో రొమాంటిక్, బోల్డ్ సీన్లు చిత్రీకరించేటప్పుడు నటీనటులు మానసికంగా, శారీరకంగా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన ట్రిక్ ఉపయోగిస్తారట. షూటింగ్ సమయంలో ఇద్దరి నటుల మధ్య గాలి తీసేసిన ఒక చిన్న ప్లాస్టిక్ 'యోగా బాల్', లేదా యోగా డిస్క్ బాల్ ఉంచుతారు. కెమెరా ముందుకు వచ్చి సీన్‌లో ఇన్వాల్వ్ అయ్యే సమయంలో నటుడు కేవలం ఆ యోగా బాల్‌ను మాత్రమే స్పర్శిస్తాడు. దీనివల్ల ఎదుటి నటి శరీరానికి నేరుగా నటుడి స్పర్శ తగలదు. "నాకు కేవలం ఆ సాఫ్ట్ బాల్ ప్రెజర్ లేదా ఇంపాక్ట్ మాత్రమే అనిపిస్తుంది, అంతే తప్ప ఎదుటి నటుడి శరీర స్పర్శ నా చర్మానికి ఏమాత్రం తగలదు" అని సారా స్పష్టం చేశారు.
ఈ వినూత్నమైన పద్ధతి వల్ల నటీనటులకు సెట్‌లో పూర్తి రక్షణ మరియు పని చేయడానికి అవసరమైన స్వేచ్ఛ లభిస్తుంది. కెమెరా ముందు అసౌకర్యంగా భావించే అనవసర శారీరక స్పర్శలు లేకుండా, తమ పరిమితులకు లోబడి చాలా ప్రొఫెషనల్‌గా సురక్షితంగా నటించే వెసులుబాటు ఈ యోగా బాల్ ట్రిక్ ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అయితే, తెరపై చూసే ప్రేక్షకులకు మాత్రం వాస్తవంగానే రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించడం హాలీవుడ్ మేకర్స్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.

Also Read: Ramayana: 'రామాయణ' పార్ట్ 1 :ప్రపంచంలోనే ముందుగా ఈ దేశంలో విడుదల..అక్కడే ఎందుకు!
ఇంతేకాకుండా, ఇటువంటి క్లిష్టమైన ఇంటిమేట్ సన్నివేశాల షూటింగ్ సమయంలో దాదాపు 3 నుంచి 4 గంటల సమయం కేటాయించి ప్రోస్టెటిక్స్ కూడా ఉపయోగిస్తారని సారా గతంలో వెల్లడించారు. 8 ఎపిసోడ్లు ఉన్న సిరీస్‌లలో నటీనటులు పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రొడక్షన్ బృందం ఇన్టిమసీ కోఆర్డినేటర్లను (Intimacy Coordinators) నియమిస్తుందనేది సినీ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఈ మాటలన్నీ బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే వాళ్ళు అసలు పట్టించుకోరు. అసలు విన్నట్టుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది తమ కంటికి ఏం కనపడుతుందని మాత్రమే. అందుకే ఆ జోనర్ సినిమాలకి నైట్ విహంగులు ఎక్కువ.
[Sarah Shahi, Yoga Ball Secret, Hollywood intimate scenes , Sex Life Netflix, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






