Home

»

Latest News

రాకాలో ఆ '37' మిస్టరీ ఏంటి: విప్పిన వాళ్ళు నిజమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్! 

Sep 17, 2026 3:22PM

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'రాకా' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.  షారుక్ తో జవాన్ తర్వాత అట్లీ ఏరి కోరి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో రాకా ఖ్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.  అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అభిమానులని, నెటిజన్లని తీవ్రమైన ఉత్కంఠకి గురిచేస్తున్న అంశం  #WhatisRaaka37 అనే కొత్త హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్. నెట్టింట రాత్రికి రాత్రే ఈ హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా విపరీతంగా ట్రెండింగ్‌లోకి వచ్చి అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ ట్రెండింగ్‌లో ప్రాధాన్యత సంతరించుకున్న '37' అనే సంఖ్య దేనికి సంకేతం? చిత్ర నిర్మాణ సంస్థ మేకర్స్ నుంచి ఎలాంటి ఊహించని సర్ప్రైజ్ లేదా బిగ్ అప్‌డేట్ రాబోతోంది? అని అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి.


కొందరైతే ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో చేస్తున్న 37వ ప్రాజెక్ట్ కి సంకేతం అయి ఉంటుందని భావిస్తుంటే, మరికొందరైతే ఈ సినిమాలో బన్నీ సరికొత్త వైల్డ్ షేడ్స్‌తో 37 విభిన్నమైన గెటప్స్ లేదా అత్యంత కీలకమైన 37 నిమిషాల హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని  అట్లీ ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన ఈ '37' మిస్టరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో, మేకర్స్ ఇస్తున్న ఈ సస్పెన్స్ అప్‌డేట్ ఏ స్థాయిలో ఉండబోతోందో అని అభిమానులు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు చేస్తు రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా చిత్ర బృందం మాత్రమే ఈ విషయంలో 37 నెంబర్ కి ఉన్న విశిష్టత చెప్పాలి. రాకా మాత్రం అల్లు అర్జున్ చేస్తున్న 22 వ సినిమా.

 


Also Read: ప్రేక్షక దేవుళ్ళకి షాక్.. చివరి నిమిషంలో ఈ సినిమాలు పోస్ట్ పోన్!

ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకోణె దీటైన క్యారక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినపడుతుండగా భారతీయ చిత్ర సీమలో ఇంతవరకు ఎవరు చూడని సరికొత్త లుక్ తో రాకా ముస్తాబవుతుందనేది మాత్రం నిజం.  

 


 

[Allu Arjun, Raaka, Raaka 37, Atlee, Deepika Padukune, Tollywood Movies Postponed, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com