Home

»

Latest News

ఆ హీరో స్టార్ పవర్ అదుర్స్: వాళ్ళు దాన్నే ఫాలో అవ్వాలి..వర్మ వ్యాఖ్యలు వైరల్ 

Nov 10, 2026 12:07PM

రామ్ గోపాల్ వర్మ.. సినీ రంగంలో ఈ పేరుకి ఉండే వైబ్రేషన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. కొంత కాలంగా ఇంటర్వూస్ ద్వారా కూడా పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ అదే సినీ వైబ్రేషన్ ని కంటిన్యూ చేస్తున్నాడు.

రీసెంట్ గా వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ అనుసరించిన వినూత్న మార్కెటింగ్ వ్యూహాన్ని వర్మ ప్రస్తావించారు. ఆమీర్ గజిని వంటి పెద్ద హిట్ తర్వాత, తారే జమీన్ పర్ వంటి చిన్న, ఆర్ట్-హౌస్ సినిమాను తక్కువ బడ్జెట్‌తో నిర్మించి, దానిని గజిని అమ్మిన ధరలో 10వ వంతుకే అమ్మేశారు.

ఈ లాజిక్ ప్రకారం, తక్కువ ధరలో అమ్మి, తక్కువ వసూళ్లు వచ్చినా సినిమా విజయం సాధించినట్లు అవుతుంది, దానివల్ల పెట్టుబడిపై రాబడి పెరుగుతుంది. ఇది భారతీయ సినీ పరిశ్రమలో చాలా మంది అనుసరించని లాజిక్ అని ఆర్జీవీ అన్నారు.

 

ఇది కూడా చదవండి: సత్యానికి ఎల్లప్పుడూ ఒక స్వరం కావాలి: ఆసక్తికరంగా మారిన రెజీనా తాజా న్యూస్!
 

భారీ బడ్జెట్ కారణంగా రాధే శ్యామ్ వంటి చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదని, బాహుబలి మాత్రం నటులు హిందీ ప్రేక్షకులకు తెలియకపోయినా, భారీ విజువల్స్ కారణంగా విజయం సాధించిందని ఆయన తెలిపారు. ఆర్జీవీ తన సొంత చిత్రాలైన శివ, సత్యలను ఉదాహరణగా చూపుతూ, తనకు ఆనందం కలిగించిన కథలనే తక్కువ బడ్జెట్‌తో, వాస్తవిక లొకేషన్లలో, పక్కా ప్లాన్ తో తీశానని వివరించారు.

సినిమాకు ఏం అవసరమో దానికే ఖర్చు చేశానని, డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో చాలా మందికి ఆడియన్స్ టేస్ట్ గురించి తక్కువ అవగాహన ఉంటుందని, ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో లేదా ఫ్లాప్ అవుతుందో అర్థం చేసుకోలేరని ఆర్జీవీ అన్నారు.

అలాగే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అనే ఇరానియన్ చిత్రాన్ని ఇండియాలో తార రం పం పేరుతో రీమేక్ చేసిన విధానాన్ని వివరిస్తూ, అసలు సినిమా వెనుక ఉన్న ఉద్దేశ్యం (“పిల్లల కోసం సినిమా తీయడం”) మారిపోయి, వ్యాపార లాభాల కోసం ప్రయత్నించినప్పుడు ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో ఆర్జీవీ ఉదహరించారు. హానెస్టీ అలాగే మెయిన్ పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వడం వల్ల చిత్రనిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం, గదర్ 2 , యానిమల్, స్త్రీ 2 వంటి విభిన్న చిత్రాలు విజయం సాధిస్తుండటాన్ని బట్టి, ప్రేక్షకులు ఏదైనా చూస్తారని స్పష్టమవుతోందని, కాబట్టి చిత్రనిర్మాతలు తమ సొంత నమ్మకాన్ని అనుసరించడమే సరైన మార్గమని ఆర్జీవీ అన్నారు.

మీకు నచ్చవచ్చు :కోట శ్రీనివాసరావు నటన సీక్రెట్ బయటకి!
మీకు నచ్చవచ్చు:  వైరల్ గా మారిన ఇరుముడి భామ ప్రియభవానీ శంకర్ 

 

[Ram Gopal Varma On Star Power And Budget, Ram Gopal Varma, RGV cinema comments, Tollywood updates, star power in movies, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com