Home

»

Latest News

నరకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది: ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్!

Nov 10, 2026 10:33AM

ప్రియా భవానీ శంకర్.. సెల్యులాయిడ్ పై తను పెర్ఫార్మ్ చేస్తుంటే అందం,అభినయం పోటీపడుతూ ఉంటాయనేది అభిమానుల నమ్మకం. వాళ్ళ నమ్మకం నిజమే అన్నట్టుగా కళ్ళ ముందు ఇంకా 'ఇరుముడి' మూవీలో తాను పోషించిన క్యారక్టర్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది.


ఇప్పుడు ఈ భామ నుంచి 'డిమోంటీ కాలనీ 3 ' రాబోతుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన హారర్‌ ఫ్రాంచైజీగా పేరుగాంచిన 'డిమోంటీ కాలనీ' నుంచి వస్తుండటంతో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా మేకర్స్ వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఈ భయానక చిత్రానికి 'డిమోంటీ కాలనీ 3' (Demonte Colony 3) అనే టైటిల్‌ను ఖరారు చేయగా, 'ది ఎండ్‌ ఈజ్‌ టూ ఫార్‌' (The End Is Too Far) అనేది దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ఉపశీర్షికగా ఉంది. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనని  వెలువరించింది.

ఇది కూడా చదవండి: రామాయణాన్ని వెనక్కి నెట్టిన స్మాల్ మూవీ: సంచలన కలెక్షన్స్!

ఈ హారర్‌ థ్రిల్లర్‌ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన అధికారిక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. "నరకానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది.. మీ కోసం ఈ సంక్రాంతికి ఓ పీడకల ఎదురు చూస్తోంది" అంటూ చిత్ర బృందం ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఆసక్తికరమైన క్యాప్షన్ సినిమాపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన టేకింగ్, భయానక వాతావరణాన్ని సృష్టించే విధానం ఈ ఫ్రాంచైజీకి ప్రధాన బలమన్న సంగతి తెలిసిందే.

కేవలం ప్రియా భవానీ శంకర్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో నటుడు అరుళ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముత్తు కుమార్, మీనాక్షి, అర్చన తదితరులు ఇతర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా అనుభూతిని పంచడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు:రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్.. అంతా రంగస్థలం! 
మీకు నచ్చవచ్చు: సాయి ధరమ్ తేజ్ ని మోసం చేసిన హీరోయిన్!

 

[Demonte Colony 3 Sankranthi Release, Demonte Colony 3, Priya Bhavani Shankar, Ajay Gnanamuthu, Sankranthi release, Horror movies, Tamil cinema news, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com