Home

»

Latest News

37 సీక్రెట్ ఇదే: అల్లు అర్జున్ 'రాకా'లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్.!

Sep 19, 2026 1:28PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ వండర్ 'రాకా'. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రీసెంట్ గా ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఒక చిన్న హింట్ వదిలింది.. అదే నంబర్ '37'.

ఆ ఒక్క నంబర్ బయటకొచ్చిందో లేదో.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ థియరీస్ ఏ రేంజ్ లో మొదలయ్యాయో ఊహించలేము. "ఏంటి ఈ 37 కథ?" అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. కానీ ఒక బిగ్ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ నటిస్తున్నారట. ఇది ఆయన నటిస్తున్న 37వ సినిమా కావడంతో.. సన్ పిక్చర్స్ ఆ నంబర్ '37'ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లీక్ ఇచ్చిందని గట్టిగా ప్రచారం జరుగుతోంది.

ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా విజన్ ఉండబోతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ విజువల్ స్పెక్టకిల్ రూపుదిద్దుకుంటోంది. అట్లీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్, ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: 'రాకా' స్టోరీ లీక్.. గ్లోబల్ మార్కెట్‌ను షేక్ చేయనున్న అల్లు అర్జున్.!

విల్ స్మిత్ వంటి గ్లోబల్ ఐకాన్ అల్లు అర్జున్ తో ఎదురుపడితే, ఆ ఫైట్ సీన్స్, ఆ డ్రామా ఏ రేంజ్ లో ఉంటాయో ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే, అసలు ఈ '37' అనేది విల్ స్మిత్ మూవీ కౌంటా? లేక ఆ నెంబర్ వెనుక వేరే సీక్రెట్ ఏమైనా ఉందా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. 

మీకు నచ్చవచ్చు: ఘాటైన ప్రేమ ఘటన.. బాలయ్య, రోజా ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్ సాంగ్.!

 

 

 

[Will Smith in Raaka, Raaka Movie 37 Mystery, Allu Arjun Raaka Movie, Atlee Raaka Movie, Raaka Movie Cast, Sun Pictures, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com