Home

»

Latest News

వారం రోజుల్లో: మహేష్ బాబు 'వారణాసి' ఇంట్రో సీన్ ఊచకోత..రాజమౌళి స్కెచ్ వైరల్

Sep 19, 2026 2:27PM


వారణాసిపై అభిమానులు, ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలని లెక్కకట్టలేని పరిస్థితి. అసలు డైలీ 'వారణాసి' టీజర్ చూడందే నిద్ర కూడా పోనీ పరిస్థితి.  పైగా రోజుకొక క్రేజీ వార్త సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే  తాజాగా చిత్రబృందం నుంచి వచ్చిన ఆసక్తికరమైన సమాచారం  అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. 


మహేష్ బాబు తన క్యారక్టర్ కి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్‌ని దాదాపుగా పూర్తి చేసాడట. కేవలం ఒకే ఒక్క వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. అయితే ఈ మిగిలి ఉన్న ఒక్క వారం వ్యవధిలోనే అసలైన విజువల్ వండర్‌ను ఆవిష్కరించేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మహేష్ బాబు క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే కీలకమైన ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌ని ఈ వారం రోజుల్లోనే అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు  రంగం సిద్ధం చేయబోతున్నారు. వెండితెరపై ఈ ఇంట్రో సీన్ చూస్తున్నప్పుడు థియేటర్లలో ఈలలు, కేకలతో రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని టాలీవుడ్ ఇన్‌సైడర్ టాక్.   ఒకవైపు ఈ భారీ ఇంట్రో సీన్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్తుండగానే, మరోవైపు మహేష్ బాబు తన రోల్ కి సంబంధించిన డబ్బింగ్ పనులని  కూడా సమాంతరంగా ప్రారంభించేయడం విశేషం. సాధారణంగా షూటింగ్ అంతా పూర్తయిన తర్వాతే డబ్బింగ్ ప్రక్రియను మొదలుపెడుతుంటారు.


ఇది కూడా చదవండి: ధురంధర్,పెద్దిని వెనక్కి నెట్టి 'ఆస్కార్' కి వెళ్లిన 'గోంధళ్'లో ఏముంది!

 

 

 కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో రాజమౌళి ప్రతి అంశాన్ని ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం ఒక హీరో చుట్టూనే కాకుండా మల్టీస్టారర్ రేంజ్‌లో రూపొందుతుండటంతో ఇతర కీలక నటీనటుల షూటింగ్ అప్‌డేట్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన ప్రధాన పోర్షన్ల చిత్రీకరణను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే మరో ముఖ్యమైన క్యారక్టర్ లో  కనిపించబోతున్న మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాల టాకీ పార్ట్ కూడా పూర్తయిందని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.   ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులను అత్యంత ఆశ్చర్యానికి గురిచేస్తున్న మరో అద్భుతమైన విషయం రామాయణం ఆధారంగా వచ్చే విజువల్ ఎపిసోడ్. కథలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న ఈ రామాయణం సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇప్పటికే వంద శాతం పూర్తయినట్లు ఇన్సైడర్ వర్గాలు వెల్లడించాయి. 

దాంతో పాటు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సారథ్యంలో మ్యూజిక్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇలా షూటింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ పనులను ఒకేసారి సమాంతరంగా రన్ చేస్తూ రాజమౌళి మార్క్ పర్‌ఫెక్షన్ చూపిస్తున్నారు. ఈ భారీ అడ్వెంచరస్ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మహేష్ బాబుని రాజమౌళి ఆలోచనలో నుంచి పుట్టిన సరికొత్త గ్లోబ్ ట్రోటర్ అవతారంలో చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ కాచుకుని కూర్చున్నారు.

 

 మీకు నచ్చవచ్చు: తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ: 'సింహరాశి'లోని ఈ క్లాసిక్ సాంగ్ మీనింగ్ తెలుసా.?

 

 

 

[Mahesh Babu, Varanasi, Rajamouli, Mahesh Babu Varanasi Movie Intro Scene, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com