
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న మూవీ 'రాకా'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ విజువల్ స్పెక్టకిల్ కేవలం మన దేశంలోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.
ఇటీవలే మేకర్స్ వదిలిన "37" అనే మిస్టరీ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. తాజాగా "Get ready to witness a global triumph!" అంటూ రిలీజ్ చేసిన చిన్న వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది.
శతాబ్దాల నాటి వేద కాలపు పౌరాణిక మిస్టరీని, నేటి ఆధునిక ప్రపంచపు సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఒకవైపు వేద కాలపు అడ్వెంచర్, మరోవైపు ఇప్పటి మోడర్న్ టైమ్‌లైన్.. రెండు విభిన్నమైన ప్రపంచాలను అట్లీ తన కళ్ళు చెదిరే విజువల్స్, అల్టిమేట్ మేకింగ్‌తో ప్రెజెంట్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2027 చివర్లో గ్రాండ్‌గా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
హాలీవుడ్ లెవెల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సాయి అభ్యంకర్ సంగీతంతో రాబోతున్న 'రాకా'.. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందోనని అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
[Raaka Global Triumph, Raaka Movie Update, Allu Arjun Raaka, Director Atlee, Sun Pictures, Deepika Padukone, Telugu Film News, Telugu News]






