
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం - AK47’పై వరుసగా ఏదో ఒక అప్డేట్ వినిపిస్తోంది. ముఖ్యంగా అక్టోబర్ 9న రావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఈ వార్తలకు చెక్ పెడుతూ నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
అక్టోబర్ 9న ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌లో ఎలాంటి మార్పు లేదని నాగవంశీ స్పష్టం చేశారు. ‘‘మా రిలీజ్ పంక్చువాలిటీపై మీకు డౌట్ ఉండొచ్చు.. కానీ ఈసారి అలాంటి డౌట్స్ ఏమీ వద్దు. అక్టోబర్ 9న వస్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అంతేకాదు.. సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా నాగవంశీ ప్రకటించారు. అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్, అక్టోబర్ 7న రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు.
ఇక సినిమా అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలోనే విడుదల కానుంది. ముఖ్యంగా ప్రీమియర్స్ ఉండవని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అంటే అక్టోబర్ 8 రాత్రి ప్రీమియర్ షోలు కాకుండా.. అక్టోబర్ 9న రెగ్యులర్ షోలతోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ నాగవంశీ చేసిన ట్వీట్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పిల్లలకు పరీక్షలు బాగా రాయించి.. ఆ తర్వాత వచ్చే హాలిడేస్‌ను ‘ఆదర్శ కుటుంబం’తో మొదలుపెట్టాలని ఆయన కోరారు. ఇది మంచి కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెబుతూ.. కుటుంబం మొత్తం థియేటర్లలో కలిసి ఎంజాయ్ చేయాలని కోరారు.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచే మంచి ఆసక్తి ఉంది. ఇటీవల విడుదలైన ‘నారాయణమ్మ’ పాట కూడా సినిమాపై బజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 37 ఏళ్ల తర్వాత గీతాంజలి.. నాగార్జున ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.!
[Naga Vamsi Tweet On Aadarsha Kutumbam Release Date, Producer Naga Vamsi Tweet, Aadarsha Kutumbam Movie, Narayanamma Song, Victory Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Nara Rohith, Telugu Film News]






