
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ప్రతి భారతీయుడి ప్రేక్షకుడి హృదయంలోకి ఎంతగా చొచ్చుకొని పోయిందో, ఆనందిగా చేసిన ప్రత్యుష బెనర్జీ కూడా అంతే స్థాయిలో ప్రతి భారతీయ ప్రేక్షకుడి హృదయంలోకి చొచ్చుకొని పోయింది. కల్మషం లేని ఆ ముగ్ద మనోహర రూపం నేటికీ అభిమానుల మనస్సులో తచ్చాడుతునే ఉందంటే ఎలాంటి అతిశయోక్తి కాదు.
2016 ఏప్రిల్ 1న ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న తన అద్దె ఇంట్లో కేవలం 24 ఏళ్ల వయస్సులోనే ప్రత్యూష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ సమయంలో ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమంటూ ప్రత్యూష తల్లిదండ్రులు బాంగూర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, నటుడు, నిర్మాత అయిన రాహుల్ రాజ్ సింగ్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్‌మెంట్ టు సూసైడ్), మానసిక, శారీరక వేధింపులు, దాడి వంటి తీవ్రమైన నేరారోపణలతో ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. దాదాపు పదేళ్ల పాటు నడిచిన ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో బాంబే హైకోర్టు తాజాగా అత్యంత సంచలన తీర్పును వెలువరించింది.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివకుమార్ జి. దిగే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును సమగ్రంగా విచారించి రాహుల్ రాజ్ సింగ్‌ను ఆత్మహత్య ప్రేరణ కేసు నుండి విముక్తి చేస్తూ (డిశ్చార్జ్) ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దిందోషి సెషన్స్ కోర్టు 2023 ఆగస్టులో రాహుల్ డిశ్చార్జ్ పిటిషన్‌ను తిరస్కరించగా, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2018లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, విచారణ ఎదుర్కొనేందుకు సరిపడా ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ముఖ్యంగా ప్రత్యూష ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు వారిద్దరి మధ్య జరిగిన చివరి టెలిఫోన్ సంభాషణ రికార్డింగ్‌ను కీలక ఆధారంగా పరిగణించింది. ఆ సంభాషణలో రాహుల్ రాజ్ సింగ్ ఆమెను ఎలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోకుండా నిరోధించడానికి ప్రయత్నించడం, తాను కారును యూ-టర్న్ తీసుకుని ఆమె వద్దకు వెంటనే వస్తున్నానని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోందని సీనియర్ అడ్వకేట్ ఆబాద్ పోండా, శ్రేయాన్స్ మిథారే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సంభాషణ ఆధారంగా ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాలనే ఉద్దేశం (క్రిమినల్ ఇంటెంట్) రాహుల్‌కు ఎంతమాత్రం లేదని, పైగా ఆమె ప్రాణాలను కాపాడేందుకే ప్రయత్నించాడని న్యాయస్థానం నిర్ధారించింది. అంతేకాకుండా, ఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఆత్మహత్య నోట్ లభించకపోవడం, ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని డిఫెన్స్ లాయర్లు ఎత్తిచూపారు. వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రత్యూష బెనర్జీ కేసులో జస్టిస్ శివకుమార్ డిగే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఈసారి, ఆయన ఒక సాక్ష్యాన్ని కోర్టు ముందు పెట్టారు. ఏప్రిల్ 1, 2026న, గోరేగావ్‌లోని ఒక అద్దె ఇంట్లో ప్రత్యూష తీవ్ర నిర్ణయం తీసుకుంది. కానీ అంతకు ముందే, ఆమె రాహుల్‌తో తన చివరిసారిగా ఫోన్ కాల్ మాట్లాడింది. అందులో ప్రత్యుష మాట్లాడుతూ తన మానసిక స్థితి బాగాలేదని చెప్పింది. అంతేకాకుండా తన పరిస్థితికి కారణం కేవలం ఒక్కరు కాదని.. తన తల్లిదండ్రులతోపాటు అందరినీ నిందించింది ప్రత్యూష. అప్పుడే రాహుల్ ఆమెతో మాట్లాడుతూ.. “అలాంటిదేమీ చేయకు, నేను వస్తున్నాను…” అంటూ చెప్పాడు. కానీ అంతలోనే ప్రత్యూష ఊహించని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి:ఆ మూవీపై 'ధమాకా' డైరెక్టర్ త్రినాథరావు సంచలన వ్యాఖ్యలు: అన్నం పెట్టిన సంగతి మర్చిపోవద్దు.

అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, చివరి క్షణంలో ప్రత్యూష ‘మార్కే భీ మాహీ తుఝ్సే ముహ్ నా మోడ్నా…’ ( “నా ప్రాణం పోయినా సరే నా ప్రియతమా… నీ నుండి నా ముఖాన్ని తిప్పుకోను, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను” అని అర్థం. చావు కూడా తమను విడదీయలేనంత గాఢమైన ప్రేమను మరియు ఎప్పటికీ తోడుంటానని అర్థం) అని సోషల్ మీడియాలో స్టేటస్ పోస్ట్ చేసి సూసైడ్ చేసుకుంది. చివరకి రాహుల్ సింగ్ ఈ కేసు నుండి విడుదలయ్యాడు.
[Pratyusha Banerjee Case Update, Pratyusha Banerjee suicide case rahul raj singh discharged, Pratyusha Banerjee, Rahul Raj Singh, Bombay High Court verdict,telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]






