Home

»

Latest News

Ntr: కొరటాలని రౌండ్ అప్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ట్వీట్ సైతం వైరల్ 

Jun 15, 2026 2:52PM

 

ఎన్టీఆర్(Ntr)అనే పేరుకి ఉన్న పవర్ ని గుర్తు చేస్తూ వన్ మాన్ షో దేవర(Devara)తో ఎన్టీఆర్  సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అభిమానులతో పాటు ప్రేక్షకులు  ఆ  సునామిని మర్చిపోవడం అనేది చాలా కష్టం. ఈ రోజు దేవర చిత్ర దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీసెలబ్రిటీలు, అభిమానులు ఆయనకి  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా కొరటాల శివకి బర్త్ డే విషెస్ చెప్తూనే  'శివ గారు.. ఇదంతా బానే ఉంది కానీ, మా దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? ప్రపంచమంతా ఆ సముద్రపు రక్తాన్ని చూడటానికి వెయిట్ చేస్తోంది అంటూ కామెంట్స్ తో  ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో  ట్రెండ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ రోజు మరో సారి సోషల్ మీడియా దేవర వశమైంది. 2024 లో సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఎన్టీఆర్ కూడా పలు సందర్భాలలో దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.

Also read: Peddi: మున్నాభయ్యాకి హ్యాండ్ ఇచ్చిన పెద్ది.. వెంకీ మామ అయినా కలిసొచ్చేనా!

కొరటాల శివ ఇటీవల గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణతో మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. 

 

     

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com