Home

»

Latest News

Peddi: మున్నాభయ్యాకి హ్యాండ్ ఇచ్చిన పెద్ది.. వెంకీ మామ అయినా కలిసొచ్చేనా!

Jun 15, 2026 2:21PM

 

 'మీర్జాపూర్' సిరీస్ లో మున్నా భయ్యారోల్ లో అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ డమ్ తెచ్చుకున్న నటుడు దివ్యేందు శర్మ(Divyenndu Sharma). ఈ నెల 4 న రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది(Peddi)తో కలిసి థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. నిజానికి పెద్దిపై దివ్యేందు శర్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఎడిటింగ్ లో పోయిందో లేక  క్యారక్టర్ నే అంతేనేమో  గాని రామ్ బుజ్జి గా అంత ఇంపార్టెన్స్ క్యారక్టర్ దొరకలేదని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. బాలీవుడ్ వర్గాల్లో కూడా  భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆదర్శ కుటుంబం" చిత్రం దివ్యేందు శర్మకు ఒక బలమైన టాలీవుడ్ లాంచ్‌ప్యాడ్‌లా మారబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో దివ్యేందు పాత్ర కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక డార్క్ అండ్ ఇంటెన్స్ షేడ్‌లో ఉంటుందని సమాచారం. ఒక ఇంటర్వ్యూలో దివ్యేందు శర్మ మాట్లాడుతూ, తనకు తెలుగు మాట్లాడటం రానందుకు కొంత సిగ్గుపడుతున్నానని, అయితే త్రివిక్రమ్ స్క్రిప్ట్, క్యారెక్టర్ డిజైనింగ్ చూసి ఫిదా అయిపోయి వెంటనే  గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడి చేసాడు.

Also read: Rashmika Mandanna: రష్మిక చిత్రానికి A సర్టిఫికెట్.. ఈ నెల 19 న వరల్డ్ వైడ్ రిలీజ్ 

వెంకటేష్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తుండగా నారా రోహిత్ ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్  క్యారక్టర్ లో  కనిపించనున్నాడు  దాదాపు 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 2వ తేదీన దసరా కానుకగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న ఈ "ఆదర్శ కుటుంబం" ఖచ్చితంగా దివ్యేందు శర్మకి  తెలుగులో ఒక బిగ్ బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com