Home

»

Latest News

తిరుమల కొండపై నితిన్: ఈ సారి అలియాస్ రుక్మిణి తో హిట్టు పక్కా!

Nov 17, 2026 11:45AM


ఇక డిజాస్టర్స్ నా వల్ల కాదు..హిట్టుల మీద హిట్లు ఇచ్చుకుంటూ పోతానని నితిన్ అభిమానులకి మాట ఇచ్చేసాడు. డిసెంబర్ 4 న వస్తున్న అప్ కమింగ్ మూవీ 'అలియాస్ రుక్మిణి' నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ చూస్తుంటే అందుకు తగ్గట్టే ఉన్నాయి.


రీసెంట్ గా  నితిన్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు.నిత్యం రద్దీగా ఉండే తిరుమల తిరుపతి క్షేత్రానికి విచ్చేసిన నితిన్, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన దృశ్యాలు మరియు సమాచారం సోషల్ మీడియాలోనూ, ప్రముఖ వార్తా మాధ్యమాలలోనూ వైరల్ అయ్యాయి. 

నితిన్ సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితంలో కుటుంబ సమేతంగా దైవదర్శనాలకు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుంటారు. ఈ విశేషాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అయ్యప్పస్వామి జీవిత చరిత్రతో పాన్ ఇండియా మూవీ:తెరపైకి ఆ స్టార్ హీరో పేరు

ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా  స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. తిరుమల తిరుపతి క్షేత్రం అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.

ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులు తరచూ తిరుమలను సందర్శించి శ్రీవారి కృపని  పొందుతుంటారు.అభిమానులు అయితే ఈ సారి హిట్ బాధ్యత ఏడుకొండల వాడు తీసుకుంటాడులే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

 

మీకు నచ్చవచ్చు:ఆ సినిమాతో హైదరాబాద్ నడిబొడ్డున ఖరీదైన స్థలం కొన్న రామోజీరావు!
మీకు నచ్చవచ్చు:సినిమా హిట్ అవ్వాలా: అయితే ఈ ముద్దుగుమ్మకి ఇంపార్టెన్స్ ఇవ్వండి!

 

 

[Tirumala, Nithiin, Edukondala Vaadu, Alias Rukumini]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com