
గాడ్ ఆఫ్ మాసెస్ హోదాలో బాలకృష్ణ సెల్యులాయిడ్ పై సాగిస్తున్న ప్రభంజనం తెలిసిందే. కత్తి పట్టుకొని శత్రువులని నరుక్కుంటూ వెళ్తుంటే ఆ హంగామా చూడటానికి రెండు కళ్ళు చాలవు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి నే ఈ విషయాన్నీ చెప్పాడు. రీసెంట్ గా బాలకృష్ణ భయపడేది ఓకే ఒక్కరికి అనే న్యూస్ సోషల్ మీడియాలో సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. మరి ఆ క్రేజీ న్యూస్ కా కహాని ఏంటో చూసేద్దాం.
జీ 5 చానల్ వేదికగా ప్రసారమవుతున్న జగపతి బాబు టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' రెండవ సీజన్‌కి బాలకృష్ణ మేనల్లుడు, అల్లుడు,ఏపి మినిస్టర్ నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇలా విడుదల కాగానే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. రాజకీయాలకే పూర్తిగా పరిమితం కాకుండా తనలోని మరో కోణాన్ని, సరదా స్వభావాన్ని, హాస్య చతురతను ఈ వేదిక ద్వారా నారా లోకేష్అ ద్భుతంగా ఆవిష్కరించారు.
షో ప్రారంభంలోనే నారా లోకేష్ ఎంతో ఉత్సాహంగా వేదికపైకి వచ్చి 'జై బాలయ్య' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసి అభిమానులని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, గోప్యమైన రహస్యాలను లోకేష్ పంచుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాలయ్య బాబు ఎవరికి భయపడతారనే ఆసక్తికరమైన రహస్యాన్ని ఈ ఎపిసోడ్లో ఆయన ప్రస్తావించడంతో ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో మరింత ఉత్సుకత పెరిగింది. బాలకృష్ణ నటించిన చిత్రాల్లోని శక్తివంతమైన డైలాగులను గుర్తుచేసుకుంటూ, ప్రోమో చివరిలో 'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు' అనే ప్రసిద్ధ మాస్ డైలాగ్‌ను లోకేష్ స్వయంగా చెప్పిన తీరు అక్కడున్న అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఒక్క డైలాగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: కిరణ్ అబ్బవరం సాంగ్ పై సిఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్: అసలేం జరుగుతుంది!

కేవలం రాజకీయాలు మరియు సినిమా విశేషాలే కాకుండా, తన మధురమైన బాల్యపు జ్ఞాపకాలను కూడా లోకేష్ ఈ షోలో ఎంతో సరదాగా పంచుకున్నారు. స్కూల్ రోజుల్లో ఉపాధ్యాయుల చేతిలో అందరికంటే ఎక్కువగా దెబ్బలు తిన్నది తానేనని ఆయన చమత్కరించారు. చిన్నతనంలో తాను చేసిన అల్లరి గురించి వివరిస్తూ, అప్పట్లో మావయ్య బాలకృష్ణతో క్రమశిక్షణ విషయంలోనూ పోటీ పడాల్సి వచ్చేదని చెబుతూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. అలాగే తన వివాహ సమయానికి సంబంధించిన ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ, ఒకరోజు తనను ఎవరో 'అల్లుడుగారు' అని పిలిచారని, ఏదో రాజకీయ ఫిట్టింగ్ పెడుతున్నారనుకుని కాస్త కంగారు పడ్డానంటూ చెప్పిన జోకులు నవ్వులు పూయించాయి. ఇలా ఒక సీనియర్ రాజకీయ నేతగా కాకుండా, ఎంతో సరదాగా సామాన్య వ్యక్తిలా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఈ షో ప్రత్యేకతగా నిలిచింది. మరి బాలయ్య ఎవరకి భయపడతాడో తెలుసుకోవాలంటే నవంబర్ 6వ తేదీన జీ5 పూర్తి ఎపిసోడ్ చూసేయండి. నవంబర్ 8వ తేదీన టెలివిజన్ ప్రేక్షకులని అలరించడానికి రాత్రి 7:30 గంటలకు జీ తెలుగు (Zee Telugu) ఛానెల్లో ప్రసారం కానుంది.
[Nara Lokesh About Balakrishna Secrets Jayammu Nischayammura, Nara Lokesh, Balakrishna, Jayammu Nischayammu Raa, Jagapathi Babu, Zee5 OTT, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]






