Home

»

Latest News

కిరణ్ అబ్బవరం సాంగ్ పై సిఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్: అసలేం జరుగుతుంది!

Oct 26, 2026 4:43PM


కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రియాలిటీ'. తాజాగా  'భజ గోవిందం' అనే మొదటి సాంగ్ రిలీజయ్యింది. పాట విన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం టాలీవుడ్ వర్గాల్లోనూ, నెట్టింట ప్రధాన హాట్ టాపిక్‌. ఆ పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

ఈ పాటలో విజువల్స్ పరంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల ప్రకృతి అందాలు, పచ్చని ప్రకృతి ఒడిలో సాగే గ్రామీణ జీవనశైలి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఊపుమీదున్న ఈ పాటకి అనూహ్యంగా మరింత ప్రచారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ అందాలను అద్భుతంగా చిత్రీకరిస్తూ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రూపొందించిన వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 'ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఆంధ్రప్రదేశ్' అంటూ ఆ విజువల్స్‌ను స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ ప్రశంసించారు. ప్రకృతి అందాలను అద్భుతంగా కెమెరాలో బంధించినందుకు సంబంధిత క్రియేటర్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు.


ఇది కూడా చదవండి: అంత అందంగా ఉంటుంది: కాబట్టే దేవుడు త్వరగా తీసుకెళ్లిపోయాడా!

 

 

ఈ పాటకి ప్రముఖ గాయని వైకోమ్ విజయలక్ష్మి తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఆమె సాంప్రదాయ శైలి ఆలాపన పాటకు మరింత వన్నె తెచ్చింది. అలాగే టాలీవుడ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన మట్టి వాసనల ట్యూన్ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. భారీ డ్రమ్స్ జోలికి వెళ్లకుండా, కేవలం శాస్త్రీయ అంశాలు మరియు స్థానిక జానపద వాయిద్యాలను అద్భుతంగా మిళితం చేసి భీమ్స్ ఇచ్చిన సంగీతం వినసొంపుగా ఉంది. ఇక ప్రముఖ గీత రచయిత సనారే అందించిన "ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము" అనే అర్థవంతమైన లైన్స్ నేటి పరుగుల జీవితంలో ప్రశాంతతను కోరుకునే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతాయి. డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. జోయ్ ఫిలిప్స్ పతాకంపై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నాడు.

 

[Cm Chandrababu Naidu About kiran Abbavaram Bhaja Govindam Song, Kiran Abbavaram, Reality Movie, Bhaja Govindam Song, Chandrababu Naidu, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

 



 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com