Home

»

Latest News

అలీ భార్య జుబేదాకి హార్ట్ సర్జరీ: కన్నీళ్లతో అలీ!

Oct 26, 2026 5:38PM


కమెడియన్ గా అలీ సృష్టించిన నవ్వుల సామ్రాజ్యానికి సుదీర్ఘ హిస్టరీ ఉంది. ఇప్పుడు తన జోరు కొంచం తగ్గినా అభిమానులు మాత్రం తన హవా మళ్ళీ స్టార్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా అలీ భార్య జుబేదా అకస్మాత్తుగా తీవ్రమైన గుండె సంబంధిత అనారోగ్య సమస్య బారిన పడ్డారు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రుచికరమైన వంటల వీడియోలను పంచుకుంటూ ప్రేక్షకుల కుటుంబ సభ్యురాలిగా మారిన జుబేదాకు ఇలాంటి ఊహించని ఆరోగ్య సమస్య ఎదురుకావడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 


అసలు తన జీవితంలో ఎప్పుడూ గుండె సమస్య వస్తుందని కలలో కూడా ఊహించలేదని జుబేదా స్వయంగా వెల్లడించారు.   కొద్ది రోజుల క్రితం ఆమెకు అకస్మాత్తుగా గుండెలో తీవ్రమైన అసౌకర్యం, నొప్పి కలగడంతో కుటుంబ సభ్యులు తక్షణమే అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను ప్రముఖ ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు అత్యవసరంగా హార్ట్ సర్జరీ చేయాలని స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామంతో అలీ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. 


ఇది కూడా చదవండి: బాలకృష్ణ భయపడేది ఆ ఒక్కరికే: సీక్రెట్ రివీల్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

 


తెరపై అందరినీ నడిపించే కమెడియన్‌గా, ఎప్పుడూ నవ్వులు పంచే అలీ.. తన అర్ధాంగి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి బెడ్‌పై పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయారు. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లే సమయంలో ఆమెను చూస్తూ ఆయన గుండె పగిలేలా ఏడ్చిన దృశ్యాలు, ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తున్నాయి. ఇక అభిమానులు జుబేదా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

 

[Comedian Ali Wife Zubaida Heart Surgery, Comedian Ali, Zubeda Ali heart surgery, Ali wife health update, Tollywood actor Ali, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]
 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com