Home

»

Latest News

బాలకృష్ణకు మూడు గంటల పాటు సర్జరీ.. డాక్టర్స్ ఏం చెప్పారంటే.?

Jul 24, 2026 10:49AM

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఊరటనిచ్చే తీపి కబురు అందింది. ఇటీవల షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఏఐజీ (AIG) ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వైద్యుల బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 

కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్ట్‌లో దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ అనుకోకుండా కాలుజారి కింద పడిపోయారు. మొదట దీనిని సాధారణ స్వల్ప గాయంగానే భావించినప్పటికీ, తదనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎడమ మోకాలికి తీవ్రమైన గాయం అయినట్లు నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయనను వెంటనే హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు.

గురువారం రోజున ఏఐజీ ఆసుపత్రికి చెందిన ప్రత్యేక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ గౌతమ్ చౌదరి నేతృత్వంలోని వైద్యుల బృందం దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్సను అత్యంత నైపుణ్యంతో పూర్తి చేశారు. ఆపరేషన్ సమయంలో నందమూరి బాలకృష్ణ ఎడమ మోకాలి గాయం చుట్టూ గడ్డకట్టిన రక్తాన్ని పూర్తిగా తొలగించారు. అంతేకాకుండా దెబ్బతిని చీలిన టెండన్‌ను మోకాలిచిప్పకు తిరిగి బలంగా అమర్చడంతో పాటుగా, గాయపడిన సపోర్టింగ్ టిష్యూలను కూడా జాగ్రత్తగా పునర్నిర్మించినట్లు డాక్టర్ గౌతమ్ చౌదరి హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

సర్జరీ విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి యథావిధిగా పనుల్లో పాల్గొనేందుకు బాలకృష్ణకు కొద్ది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించింది. తన క్రమశిక్షణ, నిరంతర ఉత్సాహంతో త్వరలోనే బాలయ్య పూర్తిస్థాయిలో కోలుకుని, మళ్లీ మునుపటి మాస్ ఎనర్జీతో సెట్స్‌లో అడుగుపెడతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Nandamuri Balakrishna, Health Bulletin, AIG Hospital, NBK111 Movie

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com