
అభిమానులు, సినీ ప్రియుల ముఖాల్లో సంతోషం నింపుతు దళపతి విజయ్ నిన్న 'జన నాయగన్' (జన నాయకుడు)తో థియేటర్స్ లోకి అడుగుపెట్టి పండుగ వాతావరణం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 78.27 కోట్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే విజయ్ గత చిత్రాల తొలి రోజు రికార్డులని మాత్రం అధిగమించలేకపోయింది.
దీనికి ప్రధాన కారణం మూవీ రిలీజ్ కిముందే సోషల్ మీడియాతో పాటు టోరెంట్ సైట్లలో హెచ్‌డీ ప్రింట్ తో లభ్యమైన పైరసీ మహమ్మారి అని ట్రేడ్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం రిలీజ్ కి ముందే ఏకంగా 1.2 కోట్ల (12 మిలియన్ల) మంది పైరసీ వెర్షన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించినట్లు హైకోర్టు విచారణలో వెల్లడైంది. ఈ ఊహించని షాక్ సినిమా ఓపెనింగ్ డే నంబర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. విజయ్ నుంచి వచ్చిన ప్రీవియస్ రెండు చిత్రాలు చూసుకుంటే లియో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 140 కోట్ల గ్రాస్ ని సాధించగా, గోట్' 120 కోట్ల గ్రాస్ కోట్లు వసూలు చేసింది. . ఆ రికార్డులతో పోలిస్తే 'జన నాయగన్' కి ఎంత తక్కువ వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు.
Also read: జన నాయగన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే.. తమిళనాడులో ఎంతంటే!
తమిళ వెర్షన్ తమిళనాడులో 41 కోట్ల గ్రాస్ తో పర్వాలేదని అనిపిస్తుండగా ఇతర భాషల్లో మాత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. తెలుగు వెర్షన్ ద్వారా కేవలం 2.75 కోట్లు, హిందీ వెర్షన్ 1.75 కోట్లు, కర్ణాటకలో 11.25 కోట్లు, కేరళలో 5.52 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తం ఇండియా గ్రాస్ 48.27 కోట్లతో కలుపుకొని ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన 30 కోట్లతో కలిపి గ్లోబల్ గ్రాస్ 78.27 కోట్లుగా నమోదైంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో కె వెంకట్ నారాయణ నిర్మించగా హెచ్. వినోద్ దర్శకుడు. ఆలస్యం తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది
vijay, jana nayakudu, jana nayagan, pooja hegde, h vinoth






