Home

»

Latest News

జన నాయగన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే.. తమిళనాడులో ఎంతంటే!

Jul 24, 2026 10:39AM

 

 

-నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన జన నాయగన్ ఉరఫ్ జన నాయకుడు
-థియేటర్స్ దగ్గ్గర పండుగ వాతావరణం 
-మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత!


అభిమానులు, సినీ ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకి తెర దించుతు నిన్న వరల్డ్ వైడ్ గా జన నాయగన్ (జన నాయకుడు) బాక్స్ ఆఫీస్ ని తన వశం చేసుకోవడానికి టేక్ ఆఫ్ అయిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింధి. రిజల్ట్ విషయంలో కొంచం తేడా కొడుతున్నా కూడా విజయ్ కట్ అవుట్ కి ఉన్న వెయిట్ దృష్ట్యా తొలి రోజు రికార్డు కలెక్షన్స్ నమోదయ్యాయి.  

వరల్డ్ వైడ్ గా తొలి రోజు  78.27 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తుంది.ఇండియా వైడ్ గా 48.27 గ్రాస్ కాగా తమిళనాడు మార్కెట్ ఈ విజయానికి ప్రధాన వెన్నుముకగా నిలిచింది. తమిళనాడు రాష్ట్రం నుంచే 24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు కావడంతో పాటు కర్ణాటకలో 11.25 కోట్ల గ్రాస్, కేరళలో 5.52 కోట్లు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలపి 4.00 కోట్ల గ్రాస్ ,ఉత్తరాది మార్కెట్‌లో హిందీ వెర్షన్ 2.25 కోట్లు , మిగిలిన  ప్రాంతాల నుంచి 3.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లో దాదాపు $3.2 మిలియన్ డాలర్లు అంటే   30  కోట్లు గ్రాస్ రాబట్టి విదేశాల్లో తనదైన రికార్డు నమోదు చేసింది. 


నార్త్ అమెరికాలోనే  $2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.  దాదాపు ₹300 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మితమైన  గతంలో వచ్చిన కొన్ని భారీ చిత్రాల డే-1 రికార్డులను ఇది తాకలేకపోయినా, ఒక ప్రాంతీయ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం విజయ్ సినీ కెరీర్‌కు సరైన ముగింపు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి రోజు సాయంత్రం, రాత్రి షోలలో 73% పైగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడంతో రాబోయే వీకెండ్‌లో వసూళ్ల తుఫాను మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ నటన, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్లలో ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగిస్తున్నాయి.

vijaythalapathy, jana nayagan, jana nayakudu, vijay, pooja hegde

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com