.webp)
సుదీర్ఘ కాలం నుంచి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల(ఆగస్టు 29 ) తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రీసెంట్ గా నాగార్జున మరో సారి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారక్టర్ లో చేయబోతున్నాడనే రూమర్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
Also Read: ప్రేక్షకుల పండుగ: ఈ వారం ఓటిటి రిలీజ్ మూవీస్ ఇవే!
తమిళ స్టార్ హీరో సూర్య తన 49వ చిత్రాన్ని జన నాయగాన్ ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూర్యకు సమానమైన ప్రాధాన్యత కలిగిన, అత్యంత బలమైన ప్రతినాయకుడి రోల్ కోసం మేకర్స్ నాగార్జునని సంప్రదించారని, వినోత్ చెప్పిన విభిన్నమైన కథాంశం, క్యారక్టర్ లోని తీవ్రత నాగార్జునని నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున గతంలో రజనీకాంత్ 'కూలీ'లో విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఏది ఏమైనా రూమర్ కనుక నిజమైతే సౌత్ సినీ ప్రేమికులు అదృష్టం చేసుకున్న వాళ్లవుతారనేది మాత్రం నిజం.

[Nagarjuna, Suriya, H vinoth, vilan Role, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]




.webp)

