Home

»

Latest News

రవితేజ ఊచకోత: 'ఇరుముడి' దెబ్బకు బాహుబలి, పుష్ప రికార్డులు అవుట్!

Aug 31, 2026 3:19PM

సాధారణంగా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అయినా సరే.. రోజులు గడిచే కొద్దీ రెండో వారంలో వసూళ్లు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రెండో వారంలో అడుగుపెట్టిన తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపిస్తున్న దూకుడు చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.

ఇరుముడి సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రతిరోజూ సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంటుంది. ముఖ్యంగా పదో రోజయిన రెండో ఆదివారం నాడు.. ఏకంగా 'బాహుబలి-2', 'పుష్ప-2' రికార్డులను బ్రేక్ చేయడం విశేషం.

ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు డబుల్ డిజిట్ షేర్ సాధించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' ఒక్కటే. ఆ సినిమా పదో రోజు ఏకంగా 16 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు దాదాపు 10 కోట్ల షేర్ తో 'ఇరుముడి' రెండో స్థానంలో నిలిచింది. 'బాహుబలి-2', 'పుష్ప-2' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు సైతం.. తెలుగునాట పదో రోజు డబుల్ డిజిట్ షేర్ రాబట్టలేకపోయాయి. అవి 8 కోట్లకు అటూఇటూగా షేర్ రాబట్టాయి. కానీ, 'ఇరుముడి' మాత్రం ఏకంగా 10 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీనిని బట్టి తెలుగునాట ఆ సినిమా ఏ స్థాయి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక వరల్డ్ వైడ్ గానూ 'ఇరుముడి' సునామీ కొనసాగుతోంది. పది రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ క్లబ్ కి చేరువైంది. ఫుల్ రన్ లో 300 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువైనా ఆశ్చర్యంలేదు.

 

 

 

[Irumudi Box Office, Irumudi Collections, Irumudi Day 10 Record, Irumudi Movie, RaviTeja, Baahubali 2, Pushpa 2, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com