
జనరల్ గా సోమవారం నాడు చాలా మంది మూడ్ డల్ గా ఉంటుందనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తూ వస్తుంది. కానీ సినీ ప్రియులు, ఓటిటి ప్రియులు మాత్రం చాలా జోష్ తో సోమవారమే మాదే అంటుంటారు. ఎందుకంటే ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే కొత్త సినిమాల లిస్ట్ తాజా న్యూస్ హోదాలో కలకాలాడుతూ ఉంటుంది. మరి ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
రేపట్నుంచి అంటే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ వారాంతంలో దాదాపు 10కి పైగా సరికొత్త సినిమాలు, ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయబోతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కామెడీలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు అలాగే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల హంగామాతో ఓటీటీ స్పేస్ పూర్తిగా హీటెక్కిపోతోంది. వీకెండ్‌లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా ఒక బ్లాక్‌బస్టర్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ వారం విడుదలయ్యే ఓటీటీ చిత్రాల్లో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు'. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కొరియన్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ హారర్-కామెడీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వరుణ్ తేజ్ పెర్ ఫార్మెన్స్, రితిక నాయక్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అదే రోజున లోకేష్ కనగరాజ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హిట్ యాక్షన్ డ్రామా 'DC' తెలుగు వర్షన్ సన్ నెక్స్ట్ (Sun NXT) వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది. దాంతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఉన్మాదం' సోనీ లివ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో మెగా డాటర్ నీహారిక కొణిదెల నిర్మించిన జగమే సంగీతం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అందుబాటులో ఉండనుంది. బాలీవుడ్ విషయానికి వస్తే, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన నైరూప్య క్రైమ్ థ్రిల్లర్ 'ఇన్‌స్పెక్టర్ జెండే' నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సీరియల్ కిల్లర్ కార్ల్ భోజ్‌రాజ్‌ను పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్ జెండే చేసిన ఉత్కంఠభరితమైన వేట నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. షానయా కపూర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన 'ఆంఖోన్ కీ గుస్తాఖియాన్' విక్రాంత్ మాస్సీతో కలసి జీ5 (Zee5) లో సెప్టెంబర్ 5న డిజిటల్ బాట పడుతోంది. యాక్షన్ ప్రియుల కోసం తాప్సీ పన్ను నటించిన అవేరింగ్ మదర్ రివెంజ్ థ్రిల్లర్ 'గాంధారి' కూడా సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్షం కాబోతోంది.
Also Read: డప్పు శ్రీను, డబ్బు శ్రీనుగా మారిపోయాడు: మల్లెపూల పల్లకికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్
మలయాళంలో సంచలనం సృష్టించిన త్రిసూర్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఆధారంగా రూపొందించిన 6 ఎపిసోడ్ల పొలిటికల్ క్రైమ్ వెబ్ సిరీస్ 'కమ్మట్టం' జీ5లో సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం కానుంది. ఇక తమిళం నుంచి సరికొత్త హారర్ కామెడీ 'హౌస్ మేట్స్' సెప్టెంబర్ 1 నుంచే జీ5లో అందుబాటులోకి వచ్చేసింది. హాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బిగ్గెస్ట్ హిట్ 'ఏ మిన్‌క్రాఫ్ట్ మూవీ' సెప్టెంబర్ 4న జియో హాట్‌స్టార్‌లో రాబోతుండగా, హాలీవుడ్ యాక్షన్ సిరీస్ 'ది జెంటిల్‌మెన్ సీజన్ 2' సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. వీటన్నింటికీ మించి బుల్లితెర వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 9' అక్కినేని నాగార్జున హోస్టింగ్‌తో సెప్టెంబర్ 7న గ్రాండ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 20 జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. మొత్తం మీద ఉత్కంఠ, నవ్వులు, భయం, డ్రామా కలగలిపిన ఈ ఓటీటీ విందు మీ వీకెండ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చేయడం ఖాయం.

[Korean Kanakaraju, varun Tej, Bigg Boss, Nagarjuna, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]





.webp)
