శ్రీకాళహస్తిలో నాగచైతన్య.. వృషకర్మ హిట్టు కాబోతుందా!
Nov 27, 2026 10:58AM

యువసామ్రాట్ నాగ చైతన్య 'వృషకర్మ' తో డిసెంబర్ 4 న సెల్యులాయిడ్, అభిమానులు, ప్రేక్షకులని తన అధీనంలో ఉంచుకోవడానికి వడివాడిగా రెడీ అవుతున్నాడు. ప్రీవియస్ చిత్రం 'తండేల్' తో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. దీన్ని బట్టి వృష కర్మ పై అంచనాల స్థాయి ఏ విధంగా ఉంటుందో చెప్పక్కర్లదు. పైగా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు.
ఈ నేపథ్యంలో నాగచైతన్య ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో కొలువు తీరి ఉన్న పరమేశ్వరి ప్రతి రూపం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబకి కూడా దర్శించుకొని రాహు కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
.webp)
ఇది కూడా చదవండి: నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
దర్శనం తర్వాత వేద పండితులు చైతన్యకి వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. వృష కర్మ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ నేపథ్యంలో రాహు కేతు సర్ప దోష నివారణకి వరల్డ్ వైడ్ గా పేరు గాంచిన శ్రీకాళహస్తి చైతన్య వెళ్లడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక వృష కర్మలో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా దర్శకుడు సుకుమార్ సమర్పణలో ఎన్టీఆర్ ఊసరవెల్లి, వరుణ్ తేజ్ తొలిప్రేమ, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, సాయి ధరమ్ తేజ్ తో విరూపాక్ష నిర్మించిన భోగవల్లి ప్రసాద్ ఆయన తనయుడు బాపినీడు నిర్మాతలు. మరి శ్రీకాళహస్తీశ్వరుడి ఆశీస్సులతో వృష కర్మ భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.
మీకు నచ్చవచ్చు
ఇంటర్వెల్ వరకు సూపర్ అంట: మరి సెకండ్ హాఫ్ పరిస్థితి!
[Naga Chaitanya, Srikalahasti, Meenakshi Chaudhary, Tollywood]




