సౌత్ ఇండియా హిట్ డైరెక్టర్లందరిపై మైత్రి మేకర్స్ కన్ను: ఆ స్కెచ్ వేసింది అందుకోసమే!
Nov 27, 2026 2:50PM

బిజినెస్ మెన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు' యాటిట్యూడ్ కి సంబంధించిన డైలాగ్ ఒకటుంటుంది సూర్య భాయ్ అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అని. ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంతే. ఓన్లీ నిర్మాణ సంస్థ కాదు బ్రాండ్. చాలా కాలం తర్వాత మైత్రి బ్యానర్ నేమ్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. ప్రస్తుత ఏఐ కాలంలో ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం అదే రూట్ కి జై కొడుతున్నారనే ఒక్క మాట చాలు మైత్రి క్యాపబిలిటీ చెప్పడానికి,.
ఇక ఇండస్ట్రీలో హీరోల క్రేజ్ ఒకవైపు ఉంటే.. హిట్ డైరెక్టర్లకు ఉండే డిమాండ్ మరోవైపు ఉంటుంది. ఒక దర్శకుడు వరుసగా రెండు హిట్లు కొడితే చాలు.. ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంటోంది. సౌత్ ఇండియాలో ఏ భాషలో ఏ దర్శకుడు హిట్ కొట్టినా.. వెంటనే అతడితో సినిమా చేసేందుకు రంగంలోకి దిగుతోంది. భారీ అడ్వాన్సులతో క్రేజీ డైరెక్టర్లను తమ బ్యానర్‌కు లాక్ చేసుకుంటోంది.
ప్రశాంత్ నీల్ నుంచి లోకేష్ వరకు!
కన్నడ నుంచి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మైత్రి సంస్థకు ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. ఆయనతో ఎన్టీఆర్ హీరోగా భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
మరోవైపు తమిళంలో సంచలన విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్‌ను కూడా మైత్రి తన కాంపౌండ్‌లోకి తీసుకొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA23 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక నెల్సన్, వెట్రిమారన్ వంటి తమిళ దర్శకులతోనూ మైత్రి అడ్వాన్సుల ఒప్పందాలు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళం, మలయాళం.. ఎక్కడా తగ్గడం లేదు!
తమిళ ఇండస్ట్రీలో సిబి చక్రవర్తి, ఆర్.రవికుమార్, అధిక్ రవిచంద్రన్ వంటి దర్శకులతోనూ మైత్రి సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి:ఎక్కడున్నారు ఓటిటి లవర్స్: పక్కా రొమాంటిక్ థ్రిల్లర్ మీ కోసమే అందులో ఉంది!
మలయాళంలోనూ మైత్రి తన పరిధిని విస్తరిస్తోంది. 'మంజుమ్మెల్ బాయ్స్'తో సంచలనం సృష్టించిన చిదంబరం, 'ఆవేశం'తో ఆకట్టుకున్న జీతూ మాధవన్ వంటి దర్శకులతో ప్రాజెక్టులు సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.
మైత్రి ప్లాన్ మామూలుగా లేదుగా!
ఒకప్పుడు తెలుగు సినిమాలకే పరిమితమైన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఇతర దక్షిణాది భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కొత్త కాంబినేషన్లు, విభిన్న కథలపై కూడా దృష్టి పెడుతోంది.
మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించిన ప్రాజెక్టులతో పాటు, దర్శకులతో ఒప్పందాలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడికావాల్సి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ అనుసరిస్తున్న వ్యూహం చూస్తుంటే సౌత్ ఇండియాలోనే బలమైన నిర్మాణ సంస్థగా ఎదగాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

మరి ఇంతమంది క్రేజీ దర్శకులతో మైత్రి నిర్మాతలు ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తారు? ఏ హీరోలతో కొత్త కాంబినేషన్లు సెట్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కంటిన్యూగా ఒకటికి నాలుగు సినిమాలు చేస్తు తెలుగు సినిమాని, తెలుగు సినిమాని నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తూ వస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కి సినీ లాల్ సలాం.
మీకు నచ్చవచ్చు
మూవీలో కామన్ మాన్ ఫోన్ నెంబర్ చూపించారు: ఇప్పుడు పోలీస్ కేసు!
ఈ ముద్దుగుమ్మ దృష్టిలో ప్రేమంటే అదేనంట: మరి మీకు!
[Mythri Movie Makers, South Indian Directors Vetri Maaran, Lokesh Kanagaraj, Kollywood]


