సినిమాలో ఫోన్ నంబర్ చూపించారు:నిజ జీవితంలో వేధింపులు..ఇప్పుడు పోలీస్ కేసు!
Nov 27, 2026 1:51PM

ఆవేశమే కాదు అత్యుత్సాహం సైతం ఒక్కోసారి తిప్పలు తెచ్చిపెడుతుందని తెలిపే సంఘటన ఎక్స్ క్లూజివ్ గా జరిగింది. అందుకే మాటే కాదు మైండ్ కూడా కంట్రోల్ లో ఉండాలని పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు ఆ ప్లేస్ లో సాక్షాత్తు సినిమానే నిలబడి ఉంది.
సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎంతటి సమస్యలు తెచ్చిపెడతాయో అని చెప్పడానికి కూడా ఇదొక ఉదాహరణ. కథలో భాగంగా ఓ ఫోన్ నంబర్ చూపించారు. కానీ ఆ నంబర్ నిజ జీవితంలో ఓ వ్యక్తి ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్ కావడంతో అతడికి వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. చివరకు వేధింపులు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో బాధితుడు కోర్టుని ఆశ్రయించగా.. తాజాగా మలయాళ చిత్ర నిర్మాత మార్టిన్ ప్రక్కట్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సినిమాలో నంబర్.. నిజ జీవితంలో వేధింపులు!
కుంచాకో బోబన్ హీరోగా చేసిన మలయాళ చిత్రం 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'లో ఓ మహిళా క్యారక్టర్ కి సంబంధించిన ఫోన్ నంబర్‌ని చూపించారు. అయితే ఆ నంబర్ తనదేనని, తన అనుమతి లేకుండానే సినిమాలో ఉపయోగించారని అక్షయ్ ప్రకాశ్ (26) అనే వ్యక్తి ఆరోపించాడు.
సినిమాలో తన మొబైల్ నంబర్ కనిపించిన తర్వాత తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వరుసగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలైందని తెలిపాడు. వాటిలో అసభ్యకరమైన సందేశాలు, బెదిరింపులు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనివల్ల తన వ్యక్తిగత జీవితం, మానసిక ప్రశాంతత దెబ్బతిన్నాయని ఆరోపించాడు.

నిర్మాత మార్టిన్ ప్రక్కట్ సహా ముగ్గురిపై కేసు
ఈ వ్యవహారంపై బాధితుడు అక్షయ్ ప్రకాశ్ ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు పోలీసులను కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: మరో రామాయణ సినిమా తియ్యండి: సుప్రీం కోర్ట్ సంచలన ప్రకటన..వాట్ నెక్స్ట్!
దీంతో కొచ్చి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిర్మాత మార్టిన్ ప్రక్కట్‌తో పాటు సిబి చావరా, రంజిత్ నాయర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. వీరిద్దరూ మార్టిన్ ప్రక్కట్ మూవీస్‌తో సంబంధం ఉన్నవారే.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టం, కేరళ పోలీస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ. అనంతలాల్ దర్యాప్తు చేస్తున్నారు.

చిన్న పొరపాటు.. పెద్ద చిక్కులు!
సినిమాల్లో ఫోన్ నంబర్లు, వాహనాల నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు చూపించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాల్లో కల్పిత నంబర్లు ఉపయోగిస్తుంటారు. కానీ నిజమైన వ్యక్తి నంబర్ తెరపై కనిపిస్తే అతడి వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది.
మరి పైన చెప్పుకున్నట్టుగా అత్యుత్సాహం మెదడుని తన అధీనంలో ఉంచుకుంటుంది. దీంతో ఎవరిని ఏమి అంటున్నామో, అసలు ఎందుకు అంటున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలియనివ్వదు. కాబట్టి పరువు పోగొట్టుకుంటాం.
మీకు నచ్చవచ్చు
ఇక ఆ హీరోయిన్ పెళ్లి బాధ్యత అల్లు అరవింద్ దే!
ఇక ఆ శాఖకి బాలయ్య హెడ్: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
[Martin Prakkat, displaying man phone number, Mollywood,Kunchacko Boban]



.webp)
