ఈ హీరోయిన్ ఇంట్లో ప్రేమంటే అదే అర్ధం అంట: బాంబ్ పేల్చిన బ్యూటీ!
Nov 27, 2026 1:06PM
.webp)
ప్రేమంటే ఏమిటంటే నిన్ను చూసాక నాకు తెలిసే, ఇది వరకు తెలియంది ఈ అనుభవం అని ప్రేమికులు పాడుకోవడం సహజం. ఆ తర్వాత ఆ ప్రేమ లక్ష్యం పెళ్లి. ఇప్పుడు ఈ విషయాలపైనే నేడు థియేటర్స్ లో సందడి చేయడానికి వచ్చిన సూరజ్ బర్జాత్యా 'యే ప్రేమ్ మోల్ లియా' బాలీవుడ్ బ్యూటీ శార్వరి వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ప్రేమ, పెళ్లి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరు ప్రేమను జీవితంలో ఒక అందమైన అనుభూతిగా చూస్తే.. మరికొందరు ప్రేమకు పెళ్లితోనే పరిపూర్ణత వస్తుందని భావిస్తారు. బాలీవుడ్ బ్యూటీ శార్వరి వాగ్ మాత్రం రెండో అభిప్రాయాన్నే నమ్ముతుందట. ప్రేమలో పడిన ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు కమిట్ అయినప్పుడు పెళ్లే అంతిమ లక్ష్యమని చెబుతోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ప్రేమంటే పెళ్లి కావాల్సిందే!
శార్వరి వాగ్ మాట్లాడుతూ.. తాను చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని . తమ కుటుంబంలో ప్రేమంటే పెళ్లి అనే భావన ఉందని, ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడి, ఒకరికొకరు నిబద్ధతతో ఉన్నప్పుడు పెళ్లి అనేది సహజమైన తదుపరి అడుగు అని అభిప్రాయపడింది. తన వ్యక్తిగత జీవితంలోనూ ఇదే నమ్ముతానని స్పష్టం చేసింది.
పెళ్లికూతురిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్న తల్లి!
ఇక శార్వరి త్వరలో 'యే ప్రేమ్ మోల్ లియా' లో హీరోయిన్గా కనిపించనుండగా ఆమె తొలిసారి పెళ్లికూతురిగా కనిపించింది. అయితే షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె తాజాగా గుర్తు చేసుకుంది.
.webp)
సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తన అక్క పెళ్లి జరిగిందని శార్వరి తెలిపింది. అప్పటికే కుటుంబంలో ఒక పెళ్లి సందడి ముగియడంతో ఇంట్లో భావోద్వేగ వాతావరణం ఉందని చెప్పింది. అలాంటి సమయంలో తెరపై తనను పెళ్లికూతురి గెటప్‌లో చూసిన తల్లి కన్నీళ్లు ఆపుకోలేకపోయిందట.
ఇప్పటికే ఒక కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన క్రమంలో, ఇప్పుడు మరో కూతురిని కూడా పెళ్లికూతురిలా చూడటంతో ఆమె తల్లి చాలా ఎమోషనల్ అయిందని శార్వరి వెల్లడించింది. అది తల్లి ప్రేమలోని సహజమైన భావోద్వేగమని చెప్పుకొచ్చింది.
సూరజ్ బర్జాత్యాకి ప్రత్యేక థ్యాంక్స్!
ఈ సినిమాలో తనను ఎంతో అందంగా పెళ్లికూతురిలా చూపించిన దర్శకుడు సూరజ్ బర్జాత్యాకు శార్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. నిజ జీవితంలో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంత అందంగా తెరపై కనిపించే అవకాశం ఉండకపోవచ్చని, అలాంటి అనుభూతిని ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.
నేడు ప్రేక్షకుల ముందుకు 'యే ప్రేమ్ మోల్ లియా'
ఆయుష్మాన్ ఖురానా, శార్వరి వాగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, సుప్రియా పాఠక్, సీమా పహ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.
.webp)
మొత్తానికి ప్రేమ, పెళ్లిపై శార్వరి చేసిన వ్యాఖ్యలు ఒకవైపు చర్చనీయాంశంగా మారితే.. మరోవైపు పెళ్లికూతురి గెటప్‌లో కూతురిని చూసి తల్లి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన అందరినీ ఎమోషనల్ చేస్తోంది.
మీకు నచ్చవచ్చు
మీ అభిమాన బాలయ్యకి అరుదైన గౌరవం!
[Sharvari Wagh, Yeh Prem Mol Liya, Sooraj Barjatya, Bollywood]



