
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘సీన్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించారు. సినిమా నచ్చడంతో సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘సీన్’ సినిమా చూసి ఎంజాయ్ చేశానని మహేష్ బాబు తెలిపారు. కూల్‌గా, స్మార్ట్‌గా, ఎంతో వినోదాత్మకంగా సినిమా ఉందంటూ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇందులో ఇన్‌బరాజ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించారని ప్రశంసించారు. నజ్రియా, నస్లెన్ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు.
దర్శకుడు జితు మాధవన్ రైటింగ్, సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయని మహేష్ కొనియాడారు. ప్రతి విభాగంలోనూ సినిమా ఆకట్టుకుందని, తప్పకుండా చూడాల్సిన చిత్రమని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒకవైపు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకు, మరోవైపు ‘సీన్’తో మంచి వినోదాన్ని అందించిన దర్శకుడు జితు మాధవన్‌కు మహేష్ ప్రశంసలు దక్కడం విశేషం. ఇక మహేష్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.?
‘ఆవేశం’, ‘రోమాంచం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జితు మాధవన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయనకు ఇది తొలి తమిళ సినిమా. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ పాత్రలో కనిపించగా.. నజ్రియా మాయగా, మలయాళ నటుడు నస్లెన్ ఈశ్వరన్‌గా నటించారు.

క్రైమ్, కామెడీ, యాక్షన్ అంశాలను కలిపి జితు మాధవన్ ఈ సినిమాను రూపొందించారు. సూర్య, జ్యోతిక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు.
మీకు నచ్చవచ్చు:
సముద్రంలో కొట్టుకుపోయిన అమల అక్కినేని.. ఎవరు కాపాడారో తెలుసా.?
వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
[Scene Review By Mahesh Babu, Mahesh Babu Twitter, Scene Movie, Suriya, Jithu Madhavan, Nazriya, Naslen, Mahesh Babu, Telugu Film News]






