Home

»

Latest News

‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు: ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.?

Nov 9, 2026 4:56PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ మైథలాజికల్ సినిమాను ప్రకటించారు.

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయనే ప్రచారం మొదలైంది. సినిమా ఆగిపోతుందా? లేక బడ్జెట్‌లో మార్పులు చేసి ముందుకు వెళ్తారా? అనే చర్చ నడుస్తోంది.

ఈ సినిమాను దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సినిమా మార్కెట్‌లో పరిస్థితులు గతంలోలా లేవు. ముఖ్యంగా ఓటీటీ, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో అనిశ్చితి నెలకొంది. గతంలో పెద్ద సినిమాలకు డిజిటల్ హక్కుల రూపంలో భారీ మొత్తాలు వచ్చేవి. ఇప్పుడు మాత్రం కంటెంట్, మార్కెట్ పరిస్థితులను బట్టి ఓటీటీ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారంగా మారిందని టాక్. మరోవైపు త్రివిక్రమ్ ఇటీవల తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకోకపోవడంతో నిర్మాతల ఆలోచనపై ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: అప్పుడు ఫిట్‌గా ఉండాల్సింది.. తన ఓల్డ్ లుక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్స్.!

అయితే ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని, ‘గాడ్ ఆఫ్ వార్’ ఖచ్చితంగా ఉంటుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం  త్రివిక్రమ్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ను అనుకున్న బడ్జెట్‌తోనే ముందుకు తీసుకెళ్లాలా? లేక బడ్జెట్‌ను తగ్గించి రీ-డిజైన్ చేయాలా? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు:
సముద్రంలో కొట్టుకుపోయిన అమల అక్కినేని.. ఎవరు కాపాడారో తెలుసా.?
వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!

 

 

 

[NTR Trivikram Movie, God Of War Budget, NTR Mythological Movie, NTR Dragon, Jr NTR Upcoming Movies, Trivikram Srinivas, Jr NTR, God Of War, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com