Home

»

Latest News

అదరగొట్టిన ఫస్ట్ డే కలెక్షన్స్: జై మహేంద్రగిరి వారాహి!

Sep 12, 2026 11:01AM

 


సీనియర్ హీరో సుమంత్ లేటెస్ట్ గా  'మహేంద్రగిరి వారాహి' తో నిన్న సెల్యులాయిడ్ పై దర్శనమిచ్చాడు.  వారాహి అమ్మవారి నేపథ్యం, మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కగా ప్రచార చిత్రాల నుంచే క్రేజ్ ఏర్పడింది. మరి అభిమానులు, ప్రేక్షకులు ఊరుకుంటారా! చలో టూ మహేంద్రగారి వారాహి అంటూ థియేటర్స్ దగ్గర సందడి చేసారు.

దీంతో ఫస్ట్ డే 35.12 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించి ఆకట్టుకుంది.ఇవి తక్కువ కలెక్షన్స్ అని తీసిపారెయ్యడానికి లేదు. ఎందుకంటే సుమంత్ లైమ్ లైట్ లో ఉండి చాలా రోజులు అవుతుంది. కాబట్టి మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 116 నగరాల్లో 446 కి పైగా షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం సగటున 18.4% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. తెలుగు వెర్షన్ నుంచే  27 లక్షలకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయి. హిందీ బెల్ట్‌లో 28 షోల ద్వారా 12% ఆక్యుపెన్సీ సాధిస్తూ మొదటి రోజు మెల్లగా ప్రయాణాన్ని ప్రారంభించింది. నగరాల వారీగా వసూళ్లను పరిశీలిస్తే, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యధికంగా 96 షోల ద్వారా 12.22 లక్షల గ్రాస్ నమోదై టాప్‌లో నిలిచింది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో 42 షోల ద్వారా ₹4.73 లక్షలు రాబట్టగా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 35 షోలలో 4.32 లక్షలు, విజయవాడలో 18 షోల ద్వారా 1.23 లక్షల వసూళ్లు నమోదయ్యాయి. విజయనగరంలో 1.08 లక్షలు, వరంగల్‌లో 91,855 గ్రాస్ రాబట్టి ప్రాంతీయంగా కూడా తన ప్రభావం చూపించింది.

 


Also Read: ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే: వీకెండ్ లో ఎంత రాబడుతుందో చూడాలి!


థియేటర్ల విషయానికి వస్తే మొత్తం 266 థియేటర్లలో  ప్రదర్శించబడగా, అందులో 2 షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి మరియు 27 కి పైగా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ కావడం విశేషం. మొత్తంగా మొదటి రోజే 24,624 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇక మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్  జోరందుకున్నాయి. రెండవ రోజు కోసం 107 నగరాల్లోని 572 షోలకి  గాను ఇప్పటికే 21.41 లక్షల అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ నమోదవడం  ప్రేక్షకుల్లో పెరిగిన ఆసక్తికి అద్దం పడుతోంది. సుమంత్ నటన, వారాహి దేవి రహస్యాల చుట్టూ తిరిగే కథనం థ్రిల్ కలిగిస్తుండటంతో వారాంతంలో ఈ కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని బాక్సాఫీస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫెస్టివల్ మూడ్ కావడం ఆపోజిట్ ఉన్న సినిమాలకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండటం మహేంద్రగిరి వారాహికి అదనపు బలం.

 

 

[Mahendragiri Varahi, Sumanth, Mahendragiri Varahi First Day Collections, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com