
బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో తెరకెక్కిన ఎపిక్ నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి ఆదరణ కనబరిచిన ఎపిక్, పెయిడ్ ప్రివ్యూల రూపంలోనే సుమారు 45.30 లక్షల గ్రాస్ వసూలు ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 కి పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం, భారత్‌లో తొలిరోజే 1,157 షోల ద్వారా ప్రదర్శితమై సుమారు 18.9% ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాల్లోకి వెళ్తే, ఇండియాలో తొలి రోజు 2.50 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ఓవర్ సీస్ కోటి గ్రాస్ సాధించట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రీమియర్స్ కూడా కలుపుకొని వరల్డ్ వైడ్ గా సుమారు 3 .5 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. నగరాల వారీగా పరిశీలిస్తే, హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా 188 షోల ద్వారా 30.05 లక్షల గ్రాస్ రాబట్టి అగ్రస్థానంలో నిలవగా, బెంగళూరులో 7.84 లక్షలు, విశాఖపట్నంలో 5.52 లక్షలు మరియు విజయవాడలో 4.61 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

తొలిరోజే దాదాపు 79,672 కి పైగా టిక్కెట్లు అమ్ముడవ్వడం ఎపిక్ కి ఉన్న డిమాండ్ స్పష్టం చేస్తోంది. అయితే మెజారిటీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వీకెండ్ ని పండుగ సీజన్ ని ఏ మేర ఎపిక్ ఉపయోగించుకుంటుందో చూడాలి.
Epic. Epic Collections, Anandh deverakonda, Vaishnavi chaitanya, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood





