Home

»

Latest News

సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం: మీకు తెలిసిన వ్యక్తే.. ఏం దోచాడో తెలిస్తే షాక్ అవుతారు

Sep 12, 2026 11:37AM

 

 

ఆనందాన్ని ఎవరు కోరుకోరు అనే లెక్కనే, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటే కాదనే వారెవరు ఉంటారు చెప్పండి. పైగా వాళ్ళు అడక్కుండానే మీకు ఏం కావాలో అని అడిగే అమాయకపు సినీ పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే తామని తాము సెల్యులాయిడ్ పై చూసుకొని మురిసిపోవాలనే ఏకైక లక్ష్యమే అజెండా. అందుకే మోసాన్ని గ్రహించలేరు. చివరకి మోసపోతారు. రీసెంట్ గా ఈ కోవలోనే హైదరాబాద్ నగరంలో ఒక సంఘటన జరిగింది.


హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ శివం రోడ్డులో ఉన్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శివ కుమార్ గౌడ్ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని లక్షల రూపాయిల డబ్బులు వసూలు చేసాడు. కానీ అవకాశాలు ఇప్పించకపోవడంతో  శివ కుమార్ గౌడ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సినిమా డిస్ట్రిబ్యూటర్ తమకి  టాలీవుడ్ చిత్రాలలో కీలక పాత్రలతో పాటు విభిన్నమైన అవకాశాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చాడు  ఆ మాటలు నిజమేనని నమ్మి, 10 మందికి పైగా  50 లక్షలకు పైగా నగదుని  డిస్ట్రిబ్యూటర్‌కి  విడతల వారీగా చెల్లించాం . అయితే, నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికీ సినిమాలో అవకాశం రాకపోవడం, అడిగితే రకరకాల వంకలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. తాము చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని గట్టిగా నిలదీయగా, డిస్ట్రిబ్యూటర్ బాధ్యతారాహిత్యంగా సమాధానమివ్వడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు దిగుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 


Also Read: అదరగొట్టిన ఫస్ట్ డే కలెక్షన్స్: జై మహేంద్రగిరి వారాహి!


 సమాచారం అందుకున్న అంబర్‌పేట్ స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను శాంతింపజేసి, ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని, బాధిత వ్యక్తుల నుంచి రాతపూర్వక ఫిర్యాదు స్వీకరించి   కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఏది ఏమైనా డబ్బు ఇస్తే అవకాశాలు రావు. . రచయిత, డైరెక్టర్ మైండ్ లో ఉన్న క్యారక్టర్ కి మీరు సెట్ అవ్వాలి. అంతకంటే ముందు మీకు యాక్టింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే సినిమా అనేది మీ చుట్టాలు చూస్తే ఆడదు కదా! 

 

 

 

[Tollywood , Film Opportunity, Distributor, Amberpeta, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com