Home

»

Latest News

సేల్స్ గర్ల్ నుండి సిల్వ‌ర్ స్క్రీన్‌ వరకు..  'ది ప్యార‌డైజ్' హీరోయిన్ ఇన్‌స్పైరింగ్ జ‌ర్నీ.!

Sep 21, 2026 4:17PM

సినిమా ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌డమ్‌ సాధించే నటీనటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్ ఒకరు. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి, నేడు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదుగుతున్న ఆమె లైఫ్ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో కయాదు లోహర్ 'సుబ్బలక్ష్మి' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఆమె గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సాధించిన విజయాల గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: శంకర్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు, 'నో' చెప్పిన మహేష్.. రీజన్ ఏంటి.?

నటనపై ఎంతో మక్కువ ఉన్నప్పటికీ, అవకాశాల కోసం వేచి చూసే క్రమంలో జీవనోపాధి కోసం కయాదు ఎన్నో సాధారణ ఉద్యోగాలు చేశారు. ఒక ప్రసిద్ధ బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేయడంతో పాటు ప్రముఖ కాఫీ షాప్ 'స్టార్‌బక్స్'లోనూ కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత కొన్ని ఐటీ కంపెనీల్లో చేరినప్పటికీ, కంప్యూటర్లు సరిగ్గా వాడటం రాకపోవడంతో ఆ శిక్షణ పూర్తి కాకుండానే బయటకు వచ్చేశానని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇక ఆమె సినీ ప్రయాణం విషయానికొస్తే.. మోడలింగ్‌లో రాణించి 'టైమ్స్ ఫ్రెష్ ఫేస్' టైటిల్ గెలుచుకున్న కయాదు, కన్నడ చిత్రం 'ముగిల్‌పేటే'తో వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీవిష్ణు సరసన 'అల్లూరి' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కోలీవుడ్‌లో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన 'డ్రాగన్' బ్లాక్‌బస్టర్ హిట్ ఆమె కెరీర్‌ను రాత్రికి రాత్రే మలుపు తిప్పేసింది.

'డ్రాగన్' విజయంతో కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య సరసన కూడా క్రేజీ ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, ప్రస్తుతం 'ది ప్యారడైజ్' చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక సామాన్య స్థాయి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె పట్టుదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

'ది ప్యారడైజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధిస్తే కయాదు లోహర్ కెరీర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పాపుల‌ర్ అవ్వ‌డం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకటేష్ రచ్చ.. రేపే ఆదర్శకుటుంబం ఫస్ట్ సింగిల్ రిలీజ్.!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com