
'అనుమాన పక్షి' అనే పేరుకి ప్రపంచ మార్కెట్ లో ఉండే గిరాకీ తెలిసిందే. లేనిది ఊహించుకుంటూ పబ్బం గడుపుతుంటాడు. ఇప్పుడు ఈ పేరుతోనే 'డిజే టిల్లు' వంటి బ్లాక్‌బస్టర్ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ మేకింగ్‌లో అనుమాన పక్షి రూపుదిద్దుకుంటున్నవిషయం తెలిసిందే. రాగ్ మయూర్ హీరో కాగా ఈ అవుట్ అండ్ అవుట్ సైకో చావోటిక్ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ రిలీజ్ ట్రైలర్ ని తాజాగా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రావలసిన ఈ చిత్రం కొద్దిరోజులు వాయిదా పడి, చివరకు సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ రిలీజ్ ప్రకటనను మేకర్స్ డిఫరెంట్ అండ్ హ్యూమరస్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసి ట్రైలర్ రూపంలో ఆవిష్కరించడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కట్ అంతా హీరో తన ఫాలోవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్లను "పక్షీస్" అని సంబోధిస్తూ ఒక వినూత్నమైన వ్లాగ్ రికార్డ్ చేస్తున్నట్లుగా చాలా ఫన్నీగా సాగుతుంది. "హాయ్ పక్షీస్.. మీ పక్షి ఇప్పుడు ఒక పెద్ద ప్యాథటిక్ సిట్యువేషన్ లో ఉన్నాడు" అంటూ రాగ్ మయూర్ చెప్పే ఫస్ట్ డైలాగ్‌తోనే అసలు వినోదం మొదలవుతుంది. సినిమా కంటెంట్ తో పాటు ప్రమోషనల్ ప్రెజెంటేషన్ పై దర్శకుడు విమల్ కృష్ణ ప్రత్యేక శ్రద్ధ వహించారు. సినిమా సెప్టెంబర్ 18న ఎందుకు విడుదల కాలేదు, అసలు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారు అని చుట్టూ ఉన్న క్యారెక్టర్లు హీరోను ఆటపట్టించే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.
మొత్తం చదవండి: నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్స్: మరి ఆంధ్ర ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి!

ట్రైలర్‌లో ఫ్రెండ్స్ అండ్ పోలీస్ క్యారెక్టర్ల హంగామా నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. "కొత్త రిలీజ్ డేట్ చెప్పకపోతే కోసేసుకుంటా" అని ఒకరు కామెంట్ చేయడం, "ఇంకోసారి పాజ్ ఇస్తే చంపేస్తా" అంటూ పోలీస్ పాత్రలోని నటుడు హీరోను బెదిరించడం వంటి సీన్స్ ట్రైలర్‌కే మేజర్ హైలైట్‌గా నిలిచాయి. ప్రమోషనల్ డ్రామాలో భాగంగా బ్రేకింగ్ న్యూస్ కి బాధ్యులు ఎవరో చెబుతాను అని హీరో అనగానే, "అసలు రీజన్ తెలిస్తే జనాలు మనల్ని ఘోరంగా ట్రోల్ చేస్తారు రా చెప్పకు" అంటూ ఫ్రెండ్స్ అడ్డుకునే కామెడీ సీన్ సినిమా కథపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది.
రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ ఆలీ, అనన్య తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక, రాజేష్ జగతియాని మరియు హరిచంద్ దాండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సునీల్ కుమార్ నామ అందించిన విజువల్స్ అండ్ కలర్‌ఫుల్ ప్రొడక్షన్ డిజైన్ ఈ కామెడీ రైడ్‌కు మంచి హైలైట్‌గా మారనున్నాయి. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్న ఈ 'అనుమాన పక్షి' సెప్టెంబర్ 25న థియేటర్లలో ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తుందో చూడాలి!
మీకు నచ్చవచ్చు: కొమ్మ కొమ్మకో సన్నాయి: 47 ఏళ్ళ క్రితం వేటూరి ఎంత గొప్ప పాట రాశారు.!
[Anumana Pakshi, Rag Mayur, Anumana Pakshi New Release Date,Anumana Pakshi Release Trailer, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




.webp)
