.webp)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ అక్టోబర్ 7 నుంచి రీ-జాయిన్ కానున్నట్లు సమాచారం.
కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ భుజానికి గాయమవ్వగా, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుంటుండటంతో.. షూట్ రీస్టార్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అక్టోబర్ 7 నుంచి ఎన్టీఆర్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్ కావడంతో.. మొదట రిస్క్ సన్నివేశాలను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. మరికొన్ని రోజుల గ్యాప్ తర్వాత యాక్షన్ సీన్స్ తెరకెక్కించే ఛాన్స్ ఉంది.
ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘డ్రాగన్’లో ఎన్టీఆర్‌ను నీల్ ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్లింప్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది.
‘డ్రాగన్’ను 2027 జూన్ లో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ గాయం కారణంగా.. షూటింగ్ కి బ్రేక్ రావడంతో.. రిలీజ్ డేట్ మారే అవకాశముంది అంటున్నారు.

[NTR Dragon Shooting Update, NTR Dragon Shoot October 7th, Jr NTR Dragon Movie, NTR Dragon Postponed, NTR Dragon Release Date, NTR Neel Movie, Telugu Film News, Telugu News]






